ETV Bharat / state

Young Man Suicide in Warangal : 6 నెలల కష్టం 'ఆన్‌లైన్‌ గేమ్‌' పాలు.. ఆపై..

author img

By

Published : Jun 24, 2023, 5:38 PM IST

Updated : Jun 24, 2023, 6:17 PM IST

Young Man Suicide in Warangal
Young Man Suicide in Warangal

Young Man Suicide After Losing Money in Online Game : ఆన్‌లైన్‌ గేమ్స్‌.. ఎన్నో కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. సరదాగా మొదలైన ఈ ఆటలు అలవాటుగా మారి.. ఆపై వ్యసనంలా తయారై చివరకు ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా వరంగల్‌ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Young Man Suicide in Warangal District : తమకున్న కాసింత పొలంలో వరి పంట వేశారు. చేతికొచ్చిన పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఏపుగా పెరిగిన తమ పొలాన్ని చూసి మురిసిపోయారు. ఇటీవల వచ్చిన వరదలతో పంట దెబ్బ తింటే.. గుండెలు బాదుకున్నారు. చేతికొచ్చిన పంట.. నోటికి అందకుండా పోయిందే అని కుమిలిపోయారు. మిగిలిన పంటతో కనీసం మన పెట్టుబడి మనకు వచ్చినా చాలులే అని సర్ది చెప్పుకున్నారు. అకాల వర్షాలకు పోనూ.. మిగిలిన పంటను కోసి, నూర్పిడి చేసి అమ్మకానికి పెట్టారు. డబ్బుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఆ డబ్బులు పడితే మరో పంటకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు తెచ్చుకోవాలని.. ఈసారి పంట బాగా తీసి అప్పులు తీర్చుకోవాలని ప్లాన్‌ చేసుకున్నారు.

Young Man Suicide at Appalraopet in Warangal : వారు అనుకున్నట్లుగానే ఇటీవల ధాన్యం డబ్బులు ఖాతాలో జమయ్యాయి. వర్షాలు మొదలయ్యాయి.. విత్తనాలు తేవాలి, దుక్కి దున్నించాలి అని ఏవేవో ఊహించుకున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అందుకు సంబంధించిన పనులు మొదలు పెడదామని అనుకున్నారు. ఇంతలోనే వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆరు నెలలు కష్టపడి పండిస్తే వచ్చిన పంట డబ్బులను.. వారి ముద్దుల కుమారుడు అరగంటలో ఆవిరి చేసేశాడు. ఖాతాలో నుంచి డబ్బులు తీసుకుంటే వృథా ఖర్చులు అవుతాయనే భయంతో వారు అందులోనే ఉంచితే.. ఇవేవీ తెలియని, పట్టని తనయుడు ఖాతాను ఖాళీ చేసేశాడు.

ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడి ఉన్న డబ్బులను పోగొట్టేశాడు. అనంతరం తల్లిదండ్రులకు విషయం తెలిస్తే మందలిస్తారని ఆత్మహత్యకు పాల్పడి కన్నవారికి కడుపుకోతను మిగిల్చాడు. ఇటు పంట డబ్బులు పోయి.. అటు చేతికి వచ్చిన కుమారుడు అనంతలోకాలకు చేరడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం అప్పల్‌రావుపేట గ్రామానికి చెందిన భాషబోయిన కమలాకర్, స్వప్న దంపతులు. వీరి రెండో కుమారుడు భాషబోయిన ఉదయ్ శుక్రవారం రాత్రి ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడి దాదాపు రూ.40 వేలు పోగొట్టుకున్నాడు.

ఉదయ్
ఉదయ్

మృతుడి తండ్రి ఇటీవలే వరి ధాన్యం అమ్మాడు. ఆ డబ్బులు మొత్తం రూ.50 వేలు తల్లి స్వప్న బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. రాత్రంతా తల్లి ఫోన్‌తో ఉదయ్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడాడు. అదే చరవాణికి బ్యాంకు ఖాతా లింకై ఉండటంతో రూ.40 వేల మొత్తం పోగొట్టుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో ఇంట్లోనే తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గమనించిన కుటుంబసభ్యులు.. గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి..

ఫోన్‌లో గేమ్స్ ఆడొద్దన్నందుకు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

జనం డబ్బుతో ఆన్​లైన్ గేమ్స్​.. రూ.2.4కోట్లు మాయం చేసిన బ్యాంక్ అధికారి

Last Updated :Jun 24, 2023, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.