ETV Bharat / state

నేను మెడిసిన్ చదువుకుంటా.. సాయం చేయండి సారూ..!!

author img

By

Published : Dec 21, 2022, 3:41 PM IST

వైద్యురాలు కావాలన్నది ఆ అమ్మాయి కల. అందుకోసం చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి మెడిసిన్ సీటు తెచ్చుకుంది. కానీ కూలీనాలీ చేసే కుటుంబానికి.. తమ కూతురును మెడిసిన్‌ చదివించడం భారంగా మారింది. దాతలు స్పందించి అమ్మాయి చదువుకు సాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.

నేను మెడిసిన్ చదువుకుంటా.. సాయం చేయండి సారూ..!!
నేను మెడిసిన్ చదువుకుంటా.. సాయం చేయండి సారూ..!!

నేను మెడిసిన్ చదువుకుంటా.. సాయం చేయండి సారూ..!!

ఈ చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. మెడిసిన్‌ సీటు సాధించినా.. చదివించడం ఆ కుటుంబానికి భారంగా మారింది. వరంగల్ మండలం పైడిపల్లి గ్రామంలోని అంబేడ్కర్ మోడల్ కాలనీకి చెందిన రమ్య.. ఒకటో తరగతి నుంచి అన్నింటా మంచి మార్కులతో పాసవుతూ వస్తోంది. డాక్టర్ కావాలన్న కల నెరవేర్చుకోవానికి కష్టాలకు ఎదురొడ్డి చదివింది. నీట్‌లో స్టేట్ ర్యాంకు 14 వేలు వచ్చింది. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో సీటు వచ్చింది. కష్టపడి చదివి మెడిసిన్‌లో సీటు సంపాదించినా.. ఈ విద్యార్థినికి పేదరికం అడ్డుగా మారింది. ఫీజు కట్టే స్తోమత లేక ఎంబీబీఎస్​లో చేరేందుకు ఇబ్బందులు పడుతోంది.

కళాశాలలో చేరేందుకు పుస్తకాలు, హాస్టల్ ఫీజుకు ఎంతలేదన్నా.. రూ.రెండున్నర లక్షలు అవుతుంది. తాపీ పనులు చేస్తున్న తండ్రికి కూతురును చదివించడం భారంగా మారింది. అయినా తల్లిదండ్రులు కష్టపడి రూ.లక్ష చెల్లించినా.. మిగిలిన మొత్తం చెల్లించడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. తెలిసిన వారిని డబ్బు అడిగినా.. లేదనడంతో ఏం చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. దాతలు ముందుకు వచ్చి సాయం చేసి తమ కూతురు చదువుకోవడానికి ఆపన్నహస్తం అందించాలని రమ్య తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

నేను మేస్త్రీ పని చేస్తా. నాకు వచ్చే డబ్బులు ఇల్లు గడవడానికే సరిపోతున్నాయి. బిడ్డ మెడిసిన్​ చదవాలంటే రూ.2.50 లక్షల వరకు ఖర్చవుతోంది. అంత డబ్బు ఖర్చు పెట్టాలంటే మా వల్ల కావట్లేదు. మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఎవరైనా దాతలు స్పందించి.. మా బిడ్డ చదువుకు సాయం చేయాలని వేడుకుంటున్నా. - రాజు, విద్యార్థిని తండ్రి

ఇవీ చూడండి..

కేంద్రానివి పార్టిషన్ పాలిటిక్స్.. మావి న్యూట్రిషన్​ పాలిటిక్స్ : మంత్రి హరీశ్​రావు

'భారత్​-చైనా సరిహద్దు సమస్యపై మౌనమెందుకు'.. పార్లమెంట్ ఎదుట విపక్షాల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.