ETV Bharat / state

హన్మకొండలో తెరాస ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం

author img

By

Published : Apr 9, 2019, 12:53 PM IST

ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అయినందున అన్ని పార్టీల నాయకులు వేగం పెంచారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో తెరాస లోక్​సభ అభ్యర్థి దయాకర్​ తరఫున వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ ఎన్నికల ప్రచారం చేశారు.

హన్మకొండలో తెరాస ప్రచారం

నేటితో ప్రచారానికి తెరపడుతున్నందున అన్ని పార్టీల నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లను కలిసేందుకున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రం హన్మకొండలో తెరాస లోక్​సభ అభ్యర్థి పసునూరి దయాకర్​ తరఫున ఎమ్మెల్యే వినయ భాస్కర్​ ఎన్నికల ప్రచారం చేశారు. నగరంలోని పలు కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. కరపత్రాలను పంచుతూ పసునూరి దయాకర్​ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రవేశ పెట్టిన పథకాలను వివరిస్తూ కారు గుర్తుకే ఓటేయాలని కోరారు.

హన్మకొండలో తెరాస ప్రచారం

ఇదీ చదవండి: హోరెత్తించిన ప్రచారం - నేటి సాయంత్రం సమాప్తం

Intro:Tg_wgl_01_09_trs_ennikala_pracharam_av_c5


Body:ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో వివిధ పార్టీ నాయకులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని వేగం పెంచారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నగరంలోని వివిధ కాలనీలు తిరుగుతూ వరంగల్ పార్లమెంట్ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి 300 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నారని చెప్పారు. పార్లమెంట్ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.....స్పాట్


Conclusion:trs ennikala pracharam
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.