ETV Bharat / state

Warangal Heavy Rains : 'వానొచ్చింది.. వరద తెచ్చింది.. మమ్మల్ని ఇట్ల ఆగం చేస్తంది'

author img

By

Published : Jul 25, 2023, 2:00 PM IST

Rains
Rains

Warngal Villager's Problems : వరంగల్‌ జిల్లాకు వాతావరణశాఖ రెడ్‌అలర్ట్‌ ప్రకటించింది. కాగా కురిసిన వర్షాలకు వరంగల్‌ పలు కాలనీల్లో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ధాన్యం, బట్టలు ఇతర వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ వరంగల్‌ జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు.

వానొచ్చింది.. వరద తీసుకొచ్చింది.. ప్రజలను ఇబ్బందులు పెడుతుంది.

Warangal Floods 2023 : మూడు రోజులపాటు విరామం ఇచ్చిన వానలు మళ్లీ ఊపందుకున్నాయి. మంగళవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ముందే ప్రకటించింది. జిల్లాకు రెడ్‌అలర్ట్‌ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాసం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలకు రేషన్‌ ఇబ్బందులు రాకుండా, ప్రసవ సమయం దగ్గర పడిన గర్భిణులను ముందస్తుగా ఆసుపత్రికి సమీపంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆయా అధికారులకు ఆదేశాలిచ్చింది.

Warangal Villagers Problems : వరంగల్‌ జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వరంగల్‌ బట్టల బజార్‌తో పాటు పోస్ట్‌ఆఫిస్‌ కూడలి కాశీబుగ్గ స్టేషన్‌ రోడ్డు రహదారులపై మురుగునీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సాయిగణేష్‌ కాలనీ, ఎస్సార్‌ నగర్‌, వివేకానంద కాలనీల్లోకి నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎనుమాముల 100 ఫీట్ల రహదారుల్లో కాలువ నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేయడం వల్ల తమ కాలనీలు జలమయమయ్యాయని ఎస్సార్‌నగర్‌, సాయి గణేష్, వివేకానంద కాలనీ వాసులు వాపోయారు.

Warangal Heavy Rains : దేశాయిపేట చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద వరంగల్‌ మహానగర్‌ పాలక సంస్థ అధికారులు మొరంపోసి చదును చేసి దసరా వేడుకలు నిర్వహించడంతో చెరువులోని పోవాల్సిన వరదనీరు ఇళ్లలోకి రావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో వరంగల్‌ మహానగర్ పాలక సంస్థ అధికారులు అప్రమత్తయ్యారు. కాగా నగరంలోని రహదారుపై నిలిచిన వరద నీటిని డిజాస్టర్‌ సిబ్బంది నగరపాలక సిబ్బంది తొలగించడంలో నిమగ్నమయ్యారు.

"ఇళ్లలోకి నీరు చేరడం వల్ల బియ్యం అన్ని తడిసిపోయాయి. ఇంట్లో వస్తువులన్నీ వరదలో కొట్టుకుపోయాయి. మేం ఇప్పుడు ఎక్కడ ఉండాలి..? రోడ్డుపైనా ఉండాలా..? మాకు న్యాయం జరగాలి. ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వాలి. స్థలాలు కబ్జాకు గురికావడం వల్ల వరద నీరు నేరుగా మా ఇళ్లలోకి వస్తున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గుళ్లలోకి వెళ్లి తలదాచుకున్నాం. కాల్వ పూర్తి నిర్మాణం చేయాలి." - ఇల్లంద వరద బాధితులు

వరంగల్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తావస్తమవుతుంది. వర్ధన్నపేట మండలం ఇల్లందలో కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు చేరి బియ్యం సహా బట్టలు, ఇళ్లలోని సామాగ్రి పూర్తిగా తడిచిపోయాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించగా కిలో మీటర్ల మేరా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమ ఇళ్లలోకి వరద వచ్చిందని తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఓట్ల సమయంలో కనిపించే నేతలు కష్టం వచ్చినప్పుడు కనిపిచరెందుకు అంటూ ప్రశ్నించారు. మరోవైపు ఐనవోలు మండలం పంథిణీ చెరువు ఉప్పొంగడంతో జాతీయ రహదారిపై 6 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.