ETV Bharat / state

'పార్టీలో చేరిన ప్రతి సభ్యుడికి సముచిత గౌరవం'

author img

By

Published : Feb 22, 2021, 12:33 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు తెరాస పార్టీలో చేరారు. గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎర్రబెల్లి.. పార్టీలో చేరిన ప్రతి సభ్యుడికి సముచిత గౌరవం దక్కుతుందని స్పష్టం చేశారు.

Thirty Congress party leaders and activists from Warangal rural district have joined the Trs party
'పార్టీలో చేరిన ప్రతి సభ్యుడికి సముచిత గౌరవం'

కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత గౌరవం దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం ఆరె గుడానికి చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెరాస పార్టీలో చేరారు. గులాబీ కండువాలు కప్పి వారిని ఎర్రబెల్లి పార్టీలోకి ఆహ్వానించారు.

దేశంలో 60లక్షల సభ్యత్వం ఆన్ లైన్ చేసిన ఏకైక పార్టీ తెరాసయేనని ఆయన గుర్తుచేశారు. ప్రతి సభ్యుడికి బీమా చేసిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని ప్రశంసించారు.

ఇదీ చూడండి: పీవీ ఘాట్​ వద్ద వాణీదేవి నివాళులు.. నేడు నామినేషన్ దాఖలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.