ETV Bharat / state

నేను బీఆర్​ఎస్​​ను తిడితే - పొన్నం ప్రభాకర్​కు కోపం ఎందుకు : బండి సంజయ్

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2024, 9:24 PM IST

Bandi Sanjay Reaction on Ponnam Prabhakar Comments : అయోధ్య అక్షింతల విషయం రాజకీయం చేయవద్దని, పార్టీలకు అతీతంగా మహత్తరమైన కార్యక్రమం జరగనుందని దీనికి కాంగ్రెస్​ నాయకులు రావాలని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్​ అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్​పై వ్యాఖ్యలు చేస్తే మంత్రి పొన్నం ప్రభాకర్​ ఎందుకు స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 350 సీట్లకు పైగా వస్తాయని జోస్యం చెప్పారు.

Bandi Sanjay at virabhadra Swamy Temple
Bandi Sanjay reaction on Ponnam Prabhakar Comments

Bandi Sanjay Reaction on Ponnam Prabhakar Comments : కేటీఆర్​పై వ్యాఖ్యలు చేస్తే మంత్రి పొన్నం ప్రభాకర్​కు ఎందుకు కోపం వస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కేటీఆర్ నోట వెలువడే మాటలే పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు చెబితే కరీంనగర్​ను వదిలి హుస్నాబాద్ పారిపోయారో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. తాను నిర్మాణాత్మకంగా సలహా ఇస్తుంటే, వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ కోరమీసాల వీరభద్రస్వామిని బండి సంజయ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి కేసీఆర్ ప్రయత్నాలు - లోక్​సభ ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చు : బండి సంజయ్

800 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాన్ని సందర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని బండి సంజయ్​ అన్నారు. కొండపైన శిథిలావస్థలో ఉన్న పురాతన ఆలయ అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి రూ.5 లక్షలు ఇస్తున్నానని, అవి సరిపోకపోతే మరో రూ.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. అయోధ్య అక్షింతలను రాజకీయం చేయడం తగదని, ఇది మహత్తర కార్యక్రమని చెప్పారు. బీజేపీ కార్యక్రమం కాదని, రాజకీయాలకు అతీతంగా జరిగే ప్రాణ ప్రతిష్ఠాపనకు(Bandi Sanjay on Ayodhya) కాంగ్రెస్​ నాయకులు రావాలని కోరారు.

బీఆర్​ఎస్​ నేతలు ఏం చేయబోతున్నారో బండి సంజయ్‌కు ఎలా తెలుసు : పొన్నం ప్రభాకర్

Bandi Sanjay Latest Comments on Congress : బీఆర్ఎస్​ పార్టీ నాయకులు ఏం మాట్లాడితే, పొన్నం అదే మాట్లాడుతున్నారని బండి సంజయ్​ అన్నారు. కేటీఆర్ మాటల వల్ల బీఆర్ఎస్ నాశనమైతే, పొన్నం వల్ల కాంగ్రెస్(Bandi Sanjay Comments on Congress) నాశనమయ్యే పరిస్థితి వస్తుందన్నారు. తాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతోందని జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తే, వ్యక్తిగత ఆరోపణలు చేశారని మండిపడ్డారు. బండి సంజయ్ కుమారుడు కొత్త బట్టలు వేసుకుంటున్నాడు, నూతన బండి ఎలా కొనుక్కున్నాడని బాధ కలిగించేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తన పిల్లలు బట్టలేసుకోవద్దు, బండి కొనుక్కోవద్దా అని నిలదీశారు.

"వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 350 సీట్లకు పైగా బీజేపీ కైవసం చేసుకోబోతోంది. ఎన్డీఏ పక్షాలతో కలిపి 400 వందల సీట్లకు పైగా గెలుస్తాం. గల్లీలో ఎవరున్నా, దిల్లీలో మోదీ ప్రభుత్వమే ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారు." - బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

నేను కేటీఆర్​ను అంటే పొన్నం ప్రభాకర్​ ఎందుకు స్పందిస్తున్నారు బండి సంజయ్

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్​కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం : బండి సంజయ్

Bandi Sanjay on Parliament Elections : కాంగ్రెస్​ నాయకుల మాదిరి తాను వ్యక్తిగత విమర్శలు చేయనని బండి సంజయ్ అన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం కొట్లాడే వ్యక్తినని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై కొట్లాడి జైలుకు పోయిన చరిత్ర తనదని గుర్తు చేశారు. పార్లమెంట్​ నియోజకవర్గంలో ఎక్కడ పోటీ చేయాలనేది బీజేపీ అధిష్ఠానం నిర్ణయమని తెలిపారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు. కేంద్రంలో మళ్లీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పటికే కేసీఆర్​, కేటీఆర్​ జైలుకి వెళ్లేవారు : బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.