ETV Bharat / state

హైదరాబాద్​లో కుమారుడి వివాహం.. వనపర్తి నుంచి బంధువు దీవెనలు

author img

By

Published : May 14, 2020, 3:38 PM IST

Updated : May 14, 2020, 7:20 PM IST

కరోనా వ్యాప్తి ప్రభావంతో మానవ జీవనశైలిలో ఎన్నో మార్పులను తెచ్చింది. విందు భోజనాలు, అతిథులు లేకుండానే వివాహాలు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి.. వివాహం చేసుకోగా.. అతని బంధువులు వాట్సాప్​ వీడియో కాల్​లో వేడుకను చూసి.. వధూవరులను దీవించారు.

parents-watched-their-son-marriage-in-whatsapp-video-call-due-to-lockdown
హైదరాబాద్​లో కుమారుడి వివాహం.. వనపర్తి నుంచి బంధువు దీవెనలు

ఒకప్పుడు పెళ్లిళ్లంటే.. ఎన్నో హంగు ఆర్భాటాలతో జరుపుకునేవారు. పెళ్లితో ముడిపడే ప్రతి వేడకను అంబరాన్నంటేలా చేసుకునేవారు. కానీ కరోనా వచ్చాక.. అలాంటి ఆలోచనలన్నీ గాల్లో మేడల్లా అనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్​లోని బాలానగర్​కు చెందిన వీరయ్య కుమారుడు అరుణ్​కు గురువారం వివాహం నిశ్చయమైంది. అయితే అతని బంధువులు వనపర్తి జిల్లాలో నివసిస్తున్నారు.

లాక్​డౌన్​ వల్ల అరుణ్​ పెళ్లికి వారంతా రాలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడప్పుడే వివాహ ముహూర్తాలు లేనందున అరుణ్​ ఇవాళే పరిణయమాడేందుకు నిశ్చయించుకున్నారు. వివాహ వేడుకను అతని బంధువులు వాట్సాప్​ వీడియోకాల్​ ద్వారా వీక్షించారు. వనపర్తి నుంచే తన కుమారునికి, కోడలికి దీవెనలందించారు.

హైదరాబాద్​లో పెళ్లి... వనపర్తి నుంచి దీవెనలు

ఇదీ చదవండి: వేరే ఉపాధి చూసుకుంటున్న భవన నిర్మాణ కార్మికులు

Last Updated : May 14, 2020, 7:20 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.