కేసీఆర్‌ను ఓడించేందుకు దండుపాళ్యం బ్యాచ్ బయల్దేరింది - కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలా?: కేటీఆర్

కేసీఆర్‌ను ఓడించేందుకు దండుపాళ్యం బ్యాచ్ బయల్దేరింది - కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలా?: కేటీఆర్
KTR Road Show at Vikarabad : ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను ఆగమాగం చేస్తాయని.. ఓటు వేసేటప్పుడు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హస్తం పార్టీకి ఇప్పటికే ఎన్నో ఛాన్సులు ఇచ్చినా.. మళ్లీ ఇప్పుడొచ్చి మరో ఛాన్స్ అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ దండుపాళ్యం బ్యాచ్ బయల్దేరిందని.. కరెంటు కావాలో.. కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
KTR Road Show at Vikarabad : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరెంట్‌పై రేవంత్‌కు అనుమానం ఉంటే విద్యుత్ తీగలను పట్టుకోవాలని చురకలంటించారు. కరెంట్‌పై మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. ఈ క్రమంలోనే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాగు నీటి సమస్య ఉండేదని.. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ సమస్య, తాగు నీటి సమస్యలు పరిష్కరించుకున్నామని స్పష్టం చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలో ఆయన పాల్గొని పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
BRS Party Election Campaign in Vikarabad : ఈ సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు నాలుగు విషయాలను ఆలోచించాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్‌లో ఎవరైనా చనిపోతే.. స్నానం చేయడానికి నీళ్ల కోసం కరెంటు లేదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి 24 గంటల కరెంట్ కనిపించడం లేదన్న మంత్రి.. కాంగ్రెస్ నాయకులంతా వికారాబాద్ వచ్చి కరెంటు తీగలు పట్టుకొని చూడాలన్నారు. తెలివి తక్కువ హస్తం నేతల చేతుల్లో రాజ్యం పెట్టొద్దన్న కేటీఆర్.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కరోనా వల్ల, కాంగ్రెస్ కేసుల వల్లే జాప్యం అవుతుందని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను ఆగమాగం చేస్తాయని కేటీఆర్ విమర్శించారు. ఓటు వేసేటప్పుడు ప్రజలు ఆలోచించాలని సూచించారు. హస్తం పార్టీకి ఇప్పటికే 11 ఛాన్సులు ఇచ్చారని.. అయినా మళ్లీ ఇప్పుడొచ్చి ఒక ఛాన్సు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. 11 అవకాశాలిచ్చినప్పుడు ఏం చేయలేని దద్దమ్మలకు, మరో ఛాన్స్ ఎందుకివ్వాలని నిలదీశారు. కరెంటు కావాలో.. కాంగ్రెస్ కావాలో వికారాబాద్ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. కరెంట్‌పై రేవంత్‌కు అనుమానం ఉంటే విద్యుత్ తీగలను పట్టుకోవాలి. కరెంట్‌పై మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదు. గత కాంగ్రెస్ హయాంలో తాగునీటి సమస్య ఉండేది. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ సమస్య, తాగు నీటి సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఓటు వేసేటప్పుడు ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్‌కు 11 ఛాన్సులు ఇచ్చారు.. మళ్లీ ఇప్పుడొచ్చి మళ్లీ ఒక ఛాన్సు అడుగుతున్నారు. కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి. - మంత్రి కేటీఆర్
డిసెంబర్ తర్వాత 4 కొత్త పథకాలు వస్తున్నాయని.. కోడళ్లందిరికి రూ.3 వేల సాయం అందిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. తెల్లరేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల జీవిత బీమా, రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్ అని.. ఆయనను ఓడించేందుకు కాంగ్రెస్ దండుపాళ్యం బ్యాచ్ బయల్దేరిందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించి రైతులు బాధపడుతున్నారన్న కేటీఆర్.. మనం ఆ తప్పు చేయొద్దని, డిసెంబర్ 3న కేసీఆర్‌ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
