'కేసీఆర్ ఏం చేశారో కళ్ల ముందే ఉంది - పనిచేసే నాయకుడిని ప్రోత్సహించడం మన కర్తవ్యం'
KTR Road Show at Moinabad : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ అని.. 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ.75 వేల కోట్లు జమ చేసిన సీఎం కేసీఆర్ అని తెలిపారు. పని చేసే నాయకుడిని ప్రోత్సహించడం మన కర్తవ్యమన్నారు.
KTR Election Campaign in Chevella : రెండుసార్లు ఆశీర్వదిస్తే కేసీఆర్ ఏం చేశారో ప్రజల కళ్ల ముందే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుబీమా పెట్టి ధీమాగా ఉండేలా కేసీఆర్ చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే చేవెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం 111 జీవోను ఎత్తేశామన్నారు. 111 జీవోలో న్యాయపరమైన చిక్కులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పని చేసే నాయకుడిని ప్రోత్సహించడం ప్రజల బాధ్యత అన్న కేటీఆర్.. కేసీఆర్‌కు అత్యంత సన్నిత ఎమ్మెల్యేల్లో కాలె యాదయ్య ఒకరని చెప్పారు. కారు గుర్తుకు ఓటు వేలి యాదయ్యను మరోసారి శాసనసభకు పంపించాలని కోరారు.