ETV Bharat / state

స్వచ్ఛ సర్వేక్షన్​లో సూర్యాపేటను అగ్రస్థానంలో నిలుపుదాం: మంత్రి

author img

By

Published : Jan 22, 2021, 11:49 AM IST

స్వచ్ఛ సూర్యాపేట సాధనకు కృషిచేస్తామని మంత్రి జగదీశ్​రెడ్డి తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ - 2021 భాగంగా పురపాలక సంఘం నిర్వహించిన 2కే రన్ కార్యక్రమాన్ని బతుకమ్మ ఘాట్​ వద్ద మంత్రి ప్రారంభించారు.

minister jagadesh reddy
'స్వచ్ఛ సర్వేక్షన్​లో సూర్యాపేట మున్సిపాలిటీ అగ్రస్థానంలో నిలవాలి'

మొక్కలు నాటడంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన ఉందని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొక్కల పెంపు ఓ ఉద్యమంలా సాగుతోందన్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్వచ్ఛ సర్వేక్షన్ - 2021 భాగంగా పురపాలక సంఘం నిర్వహించిన 2కే రన్ కార్యక్రమాన్ని బతుకమ్మ ఘాట్​ వద్ద మంత్రి ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్​, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్​లో సూర్యాపేట మున్సిపాలిటీ అగ్రస్థానంలో నిలవాలని మంత్రి ఆకాంక్షించారు.

సూర్యాపేటను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ఉందని జగదీశ్​రెడ్డి అన్నారు. ఫలితంగానే సూర్యాపేట.. దేశంలోనే మంచి పేరు తెచ్చుకుందన్నారు. సీఎం కేసీఆర్​ ఆలోచన మేరకు తడి, పొడి చెత్త వేరుగా సేకరించే విధానం గ్రామాల్లోనూ అమలవుతుందన్నారు. స్వచ్ఛ సూర్యాపేట సాధించే లక్ష్యంతో పని చేస్తామని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై మంత్రి తొలి సంతకం చేశారు. 2కే రన్​కు పట్టణ ప్రజలు భారీగా హాజరయ్యారు.

'స్వచ్ఛ సర్వేక్షన్​లో సూర్యాపేట మున్సిపాలిటీ అగ్రస్థానంలో నిలవాలి'

ఇవీచూడండి: ప్రమాదం ఆ ఇంట నింపింది పెను విషాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.