ETV Bharat / state

అదుపుతప్పిన ద్విచక్రవాహనం.. ఓ వ్యక్తి మృతి

author img

By

Published : May 17, 2019, 8:28 PM IST

ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడం వల్ల ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లా కలకోవ రోడ్డులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

అదుపుతప్పిన ద్విచక్రవాహనం.. ఓ వ్యక్తి మృతి

అదుపుతప్పిన ద్విచక్రవాహనం.. ఓ వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవ రోడ్డులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడం వల్ల శీలంశెట్టి వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందారు. మరో వ్యక్తి వంకాయలపాటి జగదీష్​కు తీవ్ర గాయాలు కావడం వల్ల కోదాడకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నందున అక్కడి నుంచి ఖమ్మం తీసుకెళ్లారు. వీరిద్దరు కలకోవలోని పెళ్లి కార్యక్రమానికి హాజరై తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. మృతుడు వెంకటేష్ కోదాడ మండలం ద్వారాకుంటకు చెందిన వ్యక్తి కాగా.. మరో వ్యక్తి జగదీష్ కోదాడ మండలం చిమిర్యాలకు చెందినవాడు.

ఇవీ చూడండి: కల్వర్టును ఢీకొట్టిన బస్సు..ఐదుగురి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.