ETV Bharat / state

అందరున్నా అనాథలా.. జేసీబీతో అంత్యక్రియలు!

author img

By

Published : Jul 26, 2020, 5:02 PM IST

కరోనా వచ్చి అందరూ ఒకరికి ఒకరు దూరమవుతున్న ఘటనలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. అందరూ ఉన్నా.. ఎవరూ లేని అనాథలా కరోనా బాధితుల మృతదేహాలను ఖననం చేస్తున్న ఘటనలు గుండెను పిండేస్తున్నాయి. ఇలాంటి ఘటనే సూర్యాపేట జిల్లా కోదాడలో చోటు చేసుకుంది.

Kodada Municipal Commissioner conduct Corona Patient funeral
అందరున్నా అనాథలా.. జేసీబీతో అంత్యక్రియలు!

సూర్యాపేట జిల్లా కోదాడ శివారులోని బాలాజీ నగర్​లో నివాసముండే 70 ఏళ్ల వృద్ధుడు కరోనాతో కన్ను మూశారు. ఒకరి వల్ల ఒకరికి కరోనా సోకుతుందన్న భయంతో కుటుంబీకులు, బంధువులు ఎవరూ ఆ వృద్ధుడి అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు. మృతదేహాన్ని అలాగే వదిలేశారు.

సమాచారం అందుకున్న కోదాడ పురపాలక కమిషనర్​ మల్లారెడ్డి జోక్యం చేసుకొని పురపాలక సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జేసీబీ సాయంతో అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. కరోనా సోకిన మృతదేహాన్ని తాకినా.. కరోనా వస్తుందన్న భయంతో చివరి చూపు కూడా చూసుకోలేకపోతున్న హృదయ విదారక ఘటనలు రాష్ట్రంలో నిత్యం ఏదో మూల చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అందరూ ఉన్నా.. అనాథ శవంలా జేసీబీలు, ట్రాక్టర్లతో ఖననం చేయాల్సి వస్తుంది.

ఇవీ చూడండి: శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.