ETV Bharat / state

ఐజీ నాగిరెడ్డి పల్లె ప్రగతి పనుల పరిశీలన

author img

By

Published : Mar 3, 2020, 11:16 PM IST

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో ఐజీ నాగిరెడ్డి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, మురుగు నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

ig nagi reddy inspect palle pragathi works
ఐజీ నాగిరెడ్డి పల్లె ప్రగతి పనుల పరిశీలన

పల్లె ప్రగతిలో భాగంగా సూర్యాపేట జిల్లాలో ఐజీ నాగిరెడ్డి పర్యటించారు. పాలకీడు, గుడుగుంట్లపాలెంలో ఏర్పాటు చేసిన నర్సీరలను పరిశీలించారు. వైకుంఠధామం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీధిలో చెత్త పడేసే వారికి జరిమానా విధించాలని సూచించారు.

పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా తడి, పొడి చెత్త వేరు చేసి స్వీకరించాలని నాగిరెడ్డి అన్నారు. అన్ని గ్రామాల్లో డంపింగ్​ యార్డులు, మురుగు నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బంజరు భూముల్లో మొక్కలు పెంచి హరిహారాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.

ఐజీ నాగిరెడ్డి పల్లె ప్రగతి పనుల పరిశీలన

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.