ETV Bharat / state

సిద్దిపేట జిల్లాలో వడగళ్ల వాన... రైతులకు తీవ్రనష్టం

author img

By

Published : Mar 24, 2019, 7:59 AM IST

సిద్దిపేట జిల్లాలో వడగళ్ల వాన... రైతులకు తీవ్రనష్టం

సిద్దిపేట జిల్లాలో వడగళ్ల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

సిద్దిపేట జిల్లాలో వడగళ్ల వాన... రైతులకు తీవ్రనష్టం
సిద్దిపేట జిల్లాలో వడగళ్ల వర్షం కురిసింది. తొగుట మండలం వేములఘట్​లో వీటి ప్రభావం అధికంగా ఉంది. వడగళ్ల ఉద్ధృతికి వరి, కూరగాయ పంటలు తీవ్రంగా నష్టపోగా... మామిడి కాయలు రాలిపోయాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి:'ప్రధాని కిసాన్​ సమ్మాన్'​ రెండో విడత నగదు బదిలీ

Intro:TG_WGL_28_23_ANGANWADI_KENDRAM_LO_PAPAKUGAYALU_AB_G1
.........................
అంగన్వాడీల నిర్లక్ష్యం ఓ చిన్నారి పసి పాప గాయపడడానికి కారణమైంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వెంకంపాడు గ్రామంలో చోటు చేసుకుంది . బాలిక తండ్రి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వెంకo పాడు గ్రామం లోని అంగన్వాడీ కేంద్రంలో అదే గ్రామానికి చెందిన తప్పెట్ల దేవేందర్- ప్రవళిక దంపతుల మూడేళ్ల కుమార్తె రుత్విక చదువుకుంటుంది. స్థానిక అంగన్వాడీ కేంద్రం నిర్వహణ సక్రమంగా సాగడం లేదని ....గత ఇరవై రోజుల క్రితమే తన చిన్నారి కేంద్రం వద్ద ఉన్న ఆట వస్తువుల పై ఆడుకుంటుండగా కాలికి గాయం అయిందన్నారు .ఆ గాయం మానక ముందే మరో విధంగా ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో గ్యాస్ అయిపోవడంతో కేంద్రం ముందు కర్రల పొయ్యి మీద వంట చేస్తున్నారు. ఈ క్రమంలో రుత్విక ఆడుకుంటూ వచ్చి ప్రమాదవశాత్తు అన్నం గిన్నెపై పడిపోయింది. వేడి మీద ఉన్న గిన్నె కావడంతో బాలిక గాయపడింది.కుడి మోచేతి వద్ద చర్మం బొబ్బలు కట్టింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని మరిపెడ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య చికిత్స చేయించారు. అనంతరం సిబ్బంది నిర్లక్ష్యంపై వారిని నిలదీశారు . అంగన్వాడీ సిబ్బంది వ్యవహరించిన నిర్లక్ష్యం తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చిన్నారి తండ్రి తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బైట్.......
1.దేవేందర్, గాయపడిన బాలిక తండ్రి


Body:గాయపడిన చిన్నారి


Conclusion:8008574820
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.