ETV Bharat / state

మట్టి గణపతుల తయారీయే... ఈ శివుడి హాబీ

author img

By

Published : Sep 2, 2019, 9:49 AM IST

మట్టి గణపతుల తయారీయే ఈ విద్యార్థి హాబీ

సరదాగా మొదలుపెట్టాడు.. ఆ తర్వాత ఆ పనిలో నైపుణ్యం సాధించాడు. ఐదో తరగతి నుంచే మట్టి వినాయక ప్రతిమల తయారీలో ఆరితేరాడు. ఏటా పదుల సంఖ్యలో మట్టి విగ్రహాలు తయారు చేసి నామమాత్రపు ధరకే విక్రయిస్తున్నాడు శివప్రసాద్​.

మట్టి గణపతుల తయారీయే ఈ విద్యార్థి హాబీ

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లికి చెందిన బుర్ర శివప్రసాద్ డిగ్రీ చదువుతున్నాడు. గత 12ఏళ్లుగా మట్టి వినాయకుల విగ్రహాలను తయారు చేస్తూ నామమాత్రపు ధరలకు విక్రయిస్తున్నాడు. తాను ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచే మట్టివినాయక విగ్రహాలను తయారుచేయడం అలవర్చుకున్నాడు. స్థానికంగా ఉండే చెరువులు, కుంటల నుండి మట్టిని తీసుకొచ్చి వరి గడ్డితో కలిపి అందమైన వినాయక విగ్రహాలకు రూపమిస్తున్నాడు. కాస్త పెద్ద విగ్రహాలు తయారు చేయడానికి ఒక్కోదానికి 2 నుంచి 3 రోజులు తీసుకొని, విగ్రహాలు తయారు చెయ్యడమే కాకుండా ఆకర్షణీయమైన సహజసిద్దమైన రంగులు అద్దుతున్నాడు. గత నాలుగేళ్లుగా శివప్రసాద్ తయారు చేస్తున్న మట్టి గణపతినే గ్రామంలోని చావడి వద్ద పెడుతున్నారు.

ఒక్కడే కావడం వల్ల...

కోహెడ, చేర్యాల, బెజ్జంకి, హుస్నాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఏటా పదుల సంఖ్యలో విగ్రహాల కోసం ఆర్డుర్లు వస్తున్నాయి. ఈ ఏడాది 40 పెద్ద మట్టివినాయక విగ్రహాలకు ఆర్డర్లు వచ్చినప్పటికీ 10 విగ్రహాలను మాత్రమే అందిస్తున్నాడు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు పిలుపుపై కొన్ని మట్టి విగ్రహాలు అందిస్తున్నాడు. తండ్రి శ్రీనివాస్ గీత కార్మికుడు, తల్లి రజిత గృహిణి. కానీ శివప్రసాద్ మాత్రం ఈ మట్టివినాయక విగ్రహాలను తయారుచెయ్యడం అలవాటుగా చేసుకున్నాడు.

ఆర్థికసాయం కోసం...

కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగాలేదకపోవడం వల్ల ఎక్కువ మట్టి విగ్రహాలు చేయాలనే తన లక్ష్యం నెరవేరడం లేదని శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందించాలని కోరుతున్నాడు.

ఇవీ చూడండి: వినాయక చవితి విశిష్టతలేమిటో...?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.