ETV Bharat / state

అధికారులపై మంత్రి హరీశ్​రావు అసహనం

author img

By

Published : Nov 20, 2019, 9:00 AM IST

అధికారులపై మంత్రి హరీశ్​రావు అసహనం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో పట్టణాభివృద్ధిపై డివిజన్​ స్థాయి అధికారులతో మంత్రి హరీశ్​రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సరైన సమాధానాలు ఇవ్వనందున కమిషనర్​ రాజమల్లయ్యపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో అభివృద్ధిపై డివిజన్​ స్థాయి అధికారులతో మంత్రి హరీశ్​రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల కమిషనర్​, మున్సిపల్ సిబ్బందిపై హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన రూ.50 లక్షలు నిధులు దేనికోసం ఉపయోగించారని ప్రశ్నించారు. కమిషనర్ రాజమల్లయ్య సరిగ్గా సమాధానం ఇవ్వనందున తీరు మార్చుకోవాలని మంత్రి సూచించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో ప్రజాప్రతినిధులు తెలిపిన సమస్యలు పరిష్కరించాలని.. లేదంటే తగు చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.

అధికారులపై మంత్రి హరీశ్​రావు అసహనం

ఇదీ చూడండి: పగలు రెక్కీ... రాత్రి దొంగతనాలు

Intro:TG_KRN_103_19_MANTHRI_ADHIKARULA PY_ASAHANAM_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-----------------------------------------------------------సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అభివృద్ధి పై డివిజన్ స్థాయి అధికారులతో మంగళవారం సాయంత్రం మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ అధికారులపై ఈ సందర్భంగా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆడిగిన ప్రశ్నలకు కమిషనర్ రాజమల్లయ్య సరి అయిన సమాధానం చెప్పక పోవడంతో కమిషనర్, మున్సిపల్ సిబ్బంది పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుండి 50 లక్షల రూపాయాలు మంజూరు చెయ్యగా, వాటిని ఎందుకు ఉపయోగించలేదని ప్రశ్నించారు. సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, స్మశాన వాటిక మొదలగు పనులు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించగా కమిషనర్ సరి అయిన సమాధానం ఇవ్వక పోవడంతో ఇప్పటికయినా తీరు మార్చుకొని పనులను సత్వరం పూర్తి చెయ్యాలని లేకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. అనంతరం మిషన్ భగీరథ పనుల ఎక్కడిదాక వచ్చాయని అధికారులను ప్రశ్నించగా పనులను త్వరిత గతిన పూర్తిచేస్తున్నామని అధికారులు తెలిపారు. అక్కడే ఉన్న హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస, ఇతర గ్రామాల సర్పంచులు మిషన్ భగీరథ అధికారులు సరి అయిన సమయానికి నీళ్ళు అందించట్లేదని, ఇంకా చాలా పనులు అసంపూర్తిగా ఉన్నాయని మంత్రి ఎదుట అధికారులను నిలదీశారు. మిషన్ భగీరథ పనుల వల్ల గ్రామాల్లో రోడ్లు, మురుగుకాలువలు శిథిలమై పోయాయని వాపోయారు. దీంతో మంత్రి హరీష్ రావు 2,3 రోజుల్లో ప్రజాప్రతినిధులు తెలిపిన సమస్యలను పరిష్కరించాలని లేకుంటే మీ పై తగు చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోConclusion:డివిజన్ స్థాయి అభివృద్ధి పనుల పై మంత్రి హరీష్ రావు సమీక్ష
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.