ETV Bharat / state

'గాంధీ, ఉస్మానియా తరహాలో సిద్దిపేట ప్రభుత్వ వైద్యకళాశాల'

author img

By

Published : Jul 6, 2019, 10:24 AM IST

గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల తరహాలో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల పురోగమించేలా చర్యలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్​రావుతో కలిసి పాల్గొన్నారు.

'గాంధీ, ఉస్మానియా తరహాలో సిద్దిపేట ప్రభుత్వ వైద్యకళాశాల'

ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరతను అధిగమించడానికి మెడికల్​ రిక్రూట్​మెంట్​ బోర్డు ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. నియామకాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. వివిధ భాగాల ఉద్యోగులు సమన్వయంతో ముందుగు సాగి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని సూచించారు. ఆరోగ్య శ్రీసేవల మెరుగు, 108 వాహనాల వినియోగం సక్రమంగా జరిగేలా చూడాలని మాజీ మంత్రి హరీశ్​రావు తెలిపిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

'గాంధీ, ఉస్మానియా తరహాలో సిద్దిపేట ప్రభుత్వ వైద్యకళాశాల'
రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_73_05_HOSPITAL REVIEW MEETING_SCRIPT_TS10058 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట . యాంకర్: ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సమీక్షా సమావేశం హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు, మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు వ్వాయిస్ ఓవర్: హరీష్ రావు మాట్లాడుతూ.....ఆరోగ్య శ్రీ సేవలు పెరగాలి...తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్నప్పుడు 150 నుంచి 200 ఆర్థోపెడిక్ కేసులు ఆరోగ్య శ్రీ లో నమోదు అయ్యేవి.. కానీ ప్రభుత్వ వైద్య కళశాల వచ్చాక ఆరోగ్య శ్రీ లో ఒక్క ఆర్థోపెడిక్ కేసు నమోదు కాలేదని మంత్రి కి వివరించిన ఎమ్మెల్యే హరిశ్ రావు సిద్దిపేట లో 70 నుంచి 80 శాతం ప్రభుత్వ ఆసుపత్రిలొనే కాన్పూలు జరగాలన్నారు.ప్రమాదం , ఎమెర్జెన్సీ సమయంలో 108 వాహనాల ద్వారా చికిత్స కోసం ప్రయివేటు కు తీసుకెళుతున్నారు అని అలా కాకుండా నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని మంత్రి ఈటెల రాజేందర్ గారిని కోరిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి పై అత్యంత విశ్వాసం పెరిగేలా కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకం , ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నా .. డెలివరీ ల సంఖ్య పెరగక పోవడం పై కారణాలు చెప్పాలని మంత్రి ముందు వైద్యులను ప్రశ్నించిన ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం స్వగ్రామం చింతమడక గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో , మరియు మర్కుక్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందిని నియమించాలని మంత్రి ఈటెల రాజేందర్ గారిని కోరిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు .జే ఎస్ కె పేమెంట్స్ నిధులు విడుదల చేయాలని , కేసీఆర్ కిట్ తో ఇచ్చే పెండింగ్ లో ఉన్న నగదు చెల్లింపులు విడుదల చేయాలని మంత్రి ని కోరిన ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ...... రానున్న కాలంలో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళశాల గాంధీ , ఉస్మానియా ఆసుపత్రుల తరహాలో పేరు తెస్తుంది.సిద్దిపేట వైద్య కళాశాల ఆసుపత్రి పురోగమించేలా చర్యలు చేపడుతాము.రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్య సిబ్బంది కొరత ఉన్నది వాస్తవం...ఇందుకు మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ను నియమించాము.. తొందరలోనే నియమాలకాల సమస్యలు పరిష్కారిస్తాం.వైద్య శాఖలో ఉన్న వివిధ విభాగాల ఉద్యోగుల్లో సమన్వయం పని చేయాలి...సఖ్యత గా ఉండాలి.. సమస్యలు ఉత్పన్నం కాకుండ చూసుకోవాల్సిన బాధ్యత వైద్య శాఖ అధికారులదే..వైద్య శాఖ చరిత్ర లోనే మందుల గడువు ముగియక ముందే ఆ మందులను పసిగట్టేలా వైద్య రంగంలో మార్పులు తెచ్చాము.రోజు వారిగా వైద్య ఆరోగ్య శాఖ పై భారం పెరుగుతునే ఉందని ...అన్ని శాఖల కంటే వైద్య ఆరోగ్యం బిన్నం సిద్దిపేట వైద్య కళాశాల పై హరిశ్ రావు గారు కోరిన అవసరాలు, సమస్యలు పై ప్రత్యేక దృష్టి సారించి ..రెగ్యులర్ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన పరిష్కరిస్తా. అన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్..

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.