ETV Bharat / state

'రాష్ట్రంలో మహిళలకే మొదటి ప్రాధాన్యం'

author img

By

Published : Feb 13, 2021, 3:53 AM IST

minister harish rao said Women are the first priority in the telangana
'రాష్ట్రంలో మహిళలకే మొదటి ప్రాధాన్యం'

రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే అన్నీ రకాల సంక్షేమ పథకాల్లో మహిళలకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు డీసీసీబీల ద్వారా అందించే రుణాల చెక్కులను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

మహిళా అభ్యున్నతికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మార్కెట్ కమిటిల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. సంగారెడ్డి జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు డీసీసీబీల ద్వారా అందించే రుణాల చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందించారు.

రాష్ట్రంలోనే మొదటిసారిగా మహిళా సంఘాలు చెల్లించిన వడ్డీలో తిరిగి వారికే వాటా చెల్లింపు చెక్కును సైతం హరీశ్ రావు వారికి అందజేశారు. గతంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఐదు లక్షలకు మించి రుణం ఇచ్చేవారు కాదని.. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆ పరిమితిని 10 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు.

తెరాస పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అని హరీశ్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం తెరాస ప్రభుత్వ పథకాలతో సాయం పోందుతున్నారని మంత్రి అన్నారు. సభ్యత్వ నమోదు కోసం కార్యకర్తలు ఇంటింటికి వెళ్లాలని ఆయన సూచించారు. వచ్చే 15 రోజులు ఎక్కువ దృష్టి సారించాలని కార్యకర్తలకు హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు.

ఇదీ చూడండి : అరకు బస్సు ప్రమాదంపై ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.