ETV Bharat / state

భాజపాతో తెరాసకు రాజకీయ చీకటి ఒప్పందం: జగ్గారెడ్డి

author img

By

Published : Dec 11, 2020, 8:17 PM IST

Updated : Dec 11, 2020, 10:41 PM IST

తెరాసకు, భాజపాతో రాజకీయ చీకటి ఒప్పందం ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడిన జగ్గారెడ్డి.. తెరాసపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్​లో భాజపాని తిట్టే సీఎం.. రాత్రికి దిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, అమిత్‌ షాతో మంతనాలు జరుపుతారని ఆక్షేపించారు.

jagga reddy chit chat with media and comments on cm kcr delhi tour
భాజపాతో తెరాసకు రాజకీయ చీకటి ఓప్పందం: జగ్గారెడ్డి

సిద్దిపేట లేనిదే కేసీఆర్‌ లేడనేది వాస్తమని.. కానీ కేసీఆర్‌ లేనిదే తెలంగాణ లేదనడం అవాస్తవమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 10నియోజకవర్గాల్లో ఎనిమిదింటిలో తెరాస శాసనసభ్యులే ఉన్నారని... సిద్దిపేట, గజ్వేల్‌ మినహాయిస్తే మిగతా 6నియోజకవర్గాల్లో తెరాస ఎమ్మెల్యేలే ఉండగా ఆ నియోజకవర్గాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్‌ లో అయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

సంగారెడ్డికి నిధులు ఇవ్వట్లేదు..

గత ఆరేళ్లుగా కేసీఆర్​ సంగారెడ్డికి నిధులు ఇవ్వడం లేదన్నారు. ప్రతి జిల్లా కేంద్రాని ఈ-మెడికల్ కాలేజ్ ఇస్తానన్న కేసీఆర్ తన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. సోనియా, రాహుల్‌ గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఈ రోజు కేసీఆర్ ఇంత అహంకారంగా మాట్లాడే వారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన రోజు మాట వరుసకు కూడా సోనియా, రాహుల్​కు కేసీఆర్‌ కృతజ్ఞత తెలపకపోవడం దారుణమన్నారు.

ఇక్కడ విమర్శలు.. అక్కడ మంతనాలు..

సిద్దిపేట నియోజకవర్గానికి హరీశ్​రావు ఆణిముత్యం కావచ్చు కానీ.. ఉమ్మడి మెదక్ జిల్లా మిగతా నియోజకవర్గాలకు కాదన్నారు. హైదరాబాద్‌లో కేసీఆర్ కొత్త సచివాలయం కడుతున్నాడు కాబట్టే.. దిల్లీలో మోదీ కడుతున్న కొత్త పార్లమెంట్‌ భవనానికి సమర్థిస్తున్నాడని ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లో భాజపాను తిట్టే సీఎం.. రాత్రికి దిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, అమిత్‌ షాతో మంతనాలు జరుపుతారని ఆక్షేపించారు. తెరాసకు, భాజపాతో రాజకీయ చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు.

ఇవీ చూడండి: కేంద్ర జల్‌శక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

Last Updated : Dec 11, 2020, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.