ETV Bharat / state

Huge Amount of Money Seized in Telangana : రాష్ట్రంలో ఎక్కడ చూసినా నోట్లకట్టలే.. ఇప్పటి వరకు రూ.168 కోట్లు సీజ్

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2023, 7:11 AM IST

Huge Amount of Money Seized in Telangana 2023 : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరమయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా నగదు తీసుకెళ్లే వారిని అదుపులోకి తీసుకోవడం సహా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌తో పాటు పండగల షాపింగ్ కోసం ప్రజలు డబ్బులు పెట్టుకొని ప్రయాణిస్తుండగా పోలీసులు మాత్రం అందరినీ ఒకే గాటిన కడుతున్నారు. సరైన పత్రాలు చూపించకపోవడంతో వెంటనే నగదు స్వాధీనం చేసుకొని ఐటీ అధికారులకు అప్పగిస్తున్నారు. ఇప్పటివరకు తనిఖీల్లో రూ.168 కోట్లు పట్టుబడినట్లు తెలుస్తోంది.

Police Seized Huge Amount of Money
Police Seized Huge Amount of Money in Telangana

Police Seized Huge Amount of Money in Telangana తనిఖీల్లో భారీగా పట్టుబడుతున్న నగదు

Huge Amount of Money Seized in Telangana 2023 : ఎన్నికల నిబంధనల పేరిట ప్రత్యేక తనిఖీ బృందాలు(Police Checks in Telangana) సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తనిఖీల్లో నగదు, బంగారం ఏదైనా బయటపడితే ఇక అంతే సంగతి సరైన పత్రాలు చూపించాలని పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు. సోదాల్లో పట్టుబడిన సొమ్ము పిల్లల ఫీజు కట్టేందుకు లేదా పెళ్లి కోసం చీరలు, బంగారం కొనడానికి తీసుకెళ్తున్నామని చెప్పినా కొన్నిచోట్ల పోలీసులు పట్టించుకోవడం లేదు. హవాలా మార్గంలో డబ్బులు తరలించేవాళ్లను, అక్రమ బంగారం(Huge Money and Gold Seized in Telangana) వ్యాపారం చేసే వాళ్లను, సామాన్యులను ఒకే తరహాలో చూస్తున్నారు. సరైన పత్రాలు చూపించకపోతే ఎన్నికల కోడ్ ప్రకారం స్వాధీనం చేసుకోవాల్సిందే అంటూ సమాధానం ఇస్తున్నారు.

Police Searches in Telangana Election Code : ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావటంతో అడుగడుగునా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. తనిఖీల ద్వారా ఇప్పటి వరకూ పట్టుకున్న సొమ్ము రూ.168 కోట్లకు పైమాటే అని అధికారులు పేర్కొన్నారు. వారిలో హవాలా, బంగారు వర్తకులు, సిరాస్తి వ్యాపారులే అధికశాతం ఉన్నారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌ శివారులో ఓ వ్యక్తి వద్ద కోటి నగదు పట్టుబడింది. వనస్థలిపురంలో కారులో తరలిస్తున్న రూ.29.40లక్షలు స్వాధీనం చేసుకున్న ఎస్​ఓటీ పోలీసులు.. వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు.

Hyderabad Police Checks Vehicles Seized Cash : కేపీహెచ్​బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రమ్య గ్రౌండ్స్​లో రూ.26 లక్షలను బాలానగర్ ఎస్​ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుషాయిగూడ ఠాణా పరిధిలోనూ వాహన తనిఖీల్లో రూ.30 లక్షలు చిక్కాయి. అబిడ్స్‌లో 5 ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.21.94 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నెక్లెస్ రోడ్‌లో ఓ ద్విచక్ర వాహనదారుడి వద్ద నుంచి రెండు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్‌లో 27.5 కిలోల బంగారం, 15.6 కిలోల వెండి పట్టుబడింది. దాన్ని ఐటీ అధికారులకు అప్పగిస్తామని మియాపూర్‌ ఇన్స్‌స్పెక్టర్‌ వెల్లడించారు. మరో వైపు తనిఖీల్లో లిక్కర్, గంజాయి భారీగా పట్టుబడుతోంది.

Police Seized 700 Sarees in Mancherial : ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ యత్నం.. మంచిర్యాలలో 700 చీరలు సీజ్ చేసిన పోలీసులు

Huge Amount of Cash Seized in Telangana 2023 : అత్యవసర పరిస్థితుల్లో నగదు తీసుకు వెళ్లాల్సివస్తే తగిన ఆధారాలు చూపాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజార్షి షా అన్నారు. ఆయన నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో భారీ ఎత్తున నగదు పట్టుబడుతోంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి రశీదులు, లెక్కాపత్రం లేని సొమ్మును పోలీసులు ఎక్కడికక్కడ స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌లోని ఐబీ గెస్ట్‌ హౌజ్ సమీపంలో వాహనాల తనిఖీలో రూ.2.36 కోట్లకు పైగా నగదును పట్టుకున్నట్లు సీపీ సుబ్బారాయుడు తెలిపారు.

క్షేత్రసాయిలో కొందరి అత్యుత్సాహంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. నియమావళి పేరుతో బ్యాంకులు, దుకాణాలు, నివాసాల్లోకి వెళ్లి.. తనిఖీలు చేయవద్దని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు, నగదు తరలింపు సమయాల్లో తప్పనిసరిగా రశీదులు దగ్గర ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.

2 Crore Money Seize in Karimnagar : కరీంనగర్​లో రూ.2.36 కోట్లు సీజ్

Police Seize 17 KG Gold in Miyapur : మియాపూర్​లో 17 కిలోల బంగారం, కవాడిగూడలో 2.09 కోట్ల నగదు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.