ETV Bharat / state

'నన్ను ఓడించేందుకు హరీశ్​రావు రూ.60 కోట్లు ఖర్చు చేశాడు - భవిష్యత్‌లో సంగారెడ్డిలో పోటీ చేయను'

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2024, 9:33 PM IST

Updated : Jan 3, 2024, 10:38 PM IST

Jagga Reddy about Sangareddy
భవిష్యత్‌లో సంగారెడ్డిలో పోటీ చేయను - పార్టీ కోసమే పని చేస్తా : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Former MLA Jaggareddy Chitchat : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్​ నేత జగ్గారెడ్డి ఇవాళ తన ఓటమి గురించి వ్యాఖ్యానించారు. ఇక నుంచి తాను సంగారెడ్డిలో పోటీ చేయనని తెలిపారు. పార్టీ కోసమే పని చేస్తానని పేర్కొన్నారు. తనను ఓడించడానికి మాజీ మంత్రి హరీశ్​రావు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు.

Former MLA Jaggareddy Chitchat : భవిష్యత్‌లో సంగారెడ్డిలో పోటీ చేయనని, ఒకరి వద్ద లాలూచీ రాజకీయం చేయనని కాంగ్రెస్​ (Congress) నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇక నుంచి తన లైన్ పూర్తిగా పార్టీ లైన్‌లోనేనని, పార్టీ కోసమే పని చేస్తానని తెలిపారు. ఇక సంగారెడ్డిలో కూడా రాజకీయాలు చేయనని, పార్టీ కోసమే పని చేస్తానని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని మీడియా ప్రతినిధులతో జరిగిన ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు.

Jagga Reddy Press Meet : సంగారెడ్డికి తాను ఎమ్మెల్యే అయిన తర్వాతనే అభివృద్ధి జరిగిందని జగ్గారెడ్డి తెలిపారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంతో పని చేయించానని గుర్తు చేశారు. జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఓట్ల కోసం బలహీనుడు కాలేడని, తాను ఓడిపోవడం వల్ల సంగారెడ్డి ప్రజలే బాధపడుతున్నారని చెప్పారు.

Jagga Reddy about Election Results : తనను ఓడించడానికి బీఆర్​ఎస్​ నేత, మాజీ మంత్రి హరీశ్​రావు(Harish Rao)రూ.60 కోట్లు ఖర్చు చేశారని కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం వస్తుందని, రేవంత్ ​రెడ్డి సీఎం అవుతారని ఆనాడే తనకు తెలుసని చెప్పారు. ఎన్నికల్లో గెలిస్తే మంత్రి అవుతానన్న విషయం కూడా తనకు తెలుసునని పేర్కొన్నారు. జగ్గారెడ్డి అందుబాటులో లేరని కొందరు ప్రశ్నిస్తున్నారు, అందుకే 24 గంటలు అందుబాటులో ఉండే తనని గెలిపించుకోమని చెప్పినట్లు తెలిపారు.

'బలవంతుడి టైం అయిపోయే దాక బలహీనుడు సైలెంట్​గానే ఉంటాడు' - జగ్గారెడ్డి చెప్పిన కథ వింటారా

శాసనసభ ఎన్నికలో ఓటమి : అయితే ఈ శాసనసభ ఎన్నికల్లో మాత్రం సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని గెలిపించుకోలేదు. సంగారెడ్డి నుంచి ఐదుసార్లు పోటీ చేస్తే 3 సార్లు మాత్రమే గెలిపించుకున్నారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మళ్లీ 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. ఇప్పుడు 2023లో మరోసారి ఓటమిని ఇచ్చారని చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓడించి ఐదు సంవత్సరాలు సంగారెడ్డి ప్రజలు రెస్ట్‌ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కుంగకుండా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చాలా సందర్భాల్లో చెప్పారు.

మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత సంగారెడ్డికి వెళ్లే బస్సులో ప్రయాణించి మహిళల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ 139వ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాద్‌లో కవాతు చేస్తూ అందరినీ ఆకర్షించారు. ఇలా నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి ఎలాంటి సహాయం కావాలన్నా ఎమ్మెల్యేగా ఓడిపోయినా, సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.

ప్రజాపాలనకు వస్తున్న స్పందన చూసి బీఆర్ఎస్​కు నిద్ర పట్టడం లేదు : మంత్రి పొన్నం

బీఆర్​ఎస్​ ఎంపీలు గెలవకపోతే పార్లమెంటులో తెలంగాణ పేరు అనామకం అవుతుంది : కేటీఆర్

Last Updated :Jan 3, 2024, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.