ETV Bharat / state

'బలవంతుడి టైం అయిపోయే దాక బలహీనుడు సైలెంట్​గానే ఉంటాడు' - జగ్గారెడ్డి చెప్పిన కథ వింటారా

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2023, 1:34 PM IST

Former MLA Jagga Reddy
Former MLA Jagga Reddy Press Note Release

Former MLA Jagga Reddy Press Note Release : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి బలవంతుడు - బలహీనుడు కథ అంటూ ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలకు ఒక సందేశాన్ని పంపించారు. అధిష్ఠానం ఆదేశిస్తే కాంగ్రెస్​ పార్టీ అభివృద్ధికి పూర్తి సమయాన్ని కేటాయిస్తానని తెలిపారు.

Former MLA Jagga Reddy Press Note Release : "ఒక బలవంతుడు భూమి మీద ఎప్పటికీ బలవంతుడిగా ఉండలేడు. కొన్ని సంవత్సరాలు మాత్రమే బలవంతుడిగా ఉంటాడు. అతడు ఏదో ఒక రోజు బలహీనుడు కాక తప్పదు. అది ఏ వ్యవస్థలోనైనా, వ్యాపారం, రాజకీయం ఏ రంగంలోనైనా అంతే. అలాగే బలహీనులు ఎప్పటికీ బలహీనులుగా ఉండరు." అంటూ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి(Jagga Reddy) ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్​ పార్టీకి, ప్రజలకు ఈ ప్రకటన ద్వారా ఆయన ఒక సందేశాన్ని పంపించారు.

'బలవంతుడి సమయం గడిచే వరకు బలహీనుడు మౌనంగానే ఉంటాడు. ఆ మౌనం బలహీనుడి బలహీనత కాదు. బలహీనుడు తన టైం కోసంఎదురుచూస్తూ ఉంటాడు. కాలం చేసే నిర్ణయంలో బలహీనుడు ఒకరోజు బలవంతుడు అవుతాడు. మనిషి జీవితం యవ్వనం నుంచి ముసలితనం వరకు ఎలాగైతే సాగుతుందో అలాగే ఈ బలవంతుడు బలహీనుడి కథ కూడా అంతే. ఒక నాయకుడి గెలుపు, ప్రజలను పరిపాలించే సమయం. ఒక నాయకుడి ఓటమి, గత పరిపాలనలో ఉన్న లోపాలు. ఆ లోపాలను సమీక్షించుకొని భవిష్యత్తులో విజయాలు సాధించడానికి ముందడగు వేసే సమయం అంటూ' సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

MLA Jagga Reddy Latest News : తాను 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో 3 సార్లు సంగారెడ్డి ప్రజలు తనను గెలిపించుకున్నారని జగ్గారెడ్డిగా తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా మంచి పరిపాలన చేశానని చెప్పారు. మొదటిసారి 2014లో ఓడిపోయినా, ఆ ఓటమి తనకు చాలా అనుభవాలు నేర్పిందని వెల్లడించారు. అలాగే ఇప్పుడు 2023 శాసనసభ ఎన్నికల్లో(Telangana Elections 2023) రెండోసారి ఓడిపోయానన్న జగ్గారెడ్డి, ఈ పది రోజుల్లోనే చాలా అనుభవాలు నేర్చుకున్నానంటూ పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఓడినవారికి పదవుల్లేవ్ - ఏడాది పాటు వేచి చూడాల్సిందే

ఎమ్మెల్యేగా లేకపోయినా : ఈసారి తమ సంగారెడ్డి ప్రజలు తనకు 5 ఏళ్లు రెస్ట్​ ఇచ్చారంటూ జగ్గారెడ్డి చెప్పారు. అందుకే ఈ సమయాన్ని తాను పూర్తిగా పార్టీ కోసం పని చేసేందుకు ఉపయోగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 6 గ్యారెంటీలను(Congress Six guarantees) తెలంగాణలో అమలు చేస్తున్నారు. అలాగే తాను ఎమ్మెల్యేగా లేకపోయినా సంగారెడ్డి ప్రజలకు కూడా ఆ పథకాలను అందేలా కృషి చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు.

"ప్రస్తుతం తాను తెలంగాణ కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా పూర్తి సమయం ఆ పదవికే కేటాయిస్తాను. సోనియాగాంధీ, రాహుల్​ గాంధీ(Rahul Gandhi) నాయకత్వంలో ఇప్పుడు సీఎం రేవంత్​ రెడ్డి అనుమతితో పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా పార్టీకి పూర్తి సమయాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. అందుకే నా ఆలోచనను కాంగ్రెస్​ నాయకత్వానికి, ప్రభుత్వంలోని ఉన్న నాయకత్వానికి, నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్​ పార్టీ అభిమానుకు, రాష్ట్ర ప్రజలకు తెలియ జేస్తున్నాను" - జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ వర్కింగ్​ ప్రెసిడెంట్​

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన కాంగ్రెస్​ను మరవద్దు : జగ్గారెడ్డి

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిది : సీఎం రేవంత్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.