ETV Bharat / state

నీటి ఎద్దడి తొలగించాలని ఆందోళన

author img

By

Published : Apr 22, 2020, 4:38 PM IST

నీటి ఎద్దడి తొలగించాలని డిమాండ్ చేస్తూ... సంగారెడ్డి జిల్లా చేర్యాల గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు.

chetyala-village-people-protest-for-water
నీటి ఎద్దడి తొలగించాలని ఆందోళన

సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాలలో నీటి ఎద్దడి తొలగించాలని గ్రామ పంచాయతీ ముందు గ్రామస్థులు ధర్నా చేశారు. గ్రామంలోని 7వ వార్డులో.. 3 నెలలుగా నీటి ఇబ్బంది ఉందని ఎంత చెప్పినా.. అధికారులు రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పి నీటి ట్యాంకర్​ను ఏర్పాటు చేశారు. వార్డులో 130 మీటర్ల మేర పైపులైను వేయిస్తామని.. వీలైనంత త్వరలో నీటి ఎద్దడి తీరుస్తామని పేర్కొన్నారు. అప్పటి వరకు రోజూ నీటి ట్యాంకర్​ను పంపుతామని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కరోనాపై 85ఏళ్ల బామ్మ విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.