ETV Bharat / state

'నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు'

author img

By

Published : Jun 1, 2021, 8:11 PM IST

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని డీలర్లకు శంషాబాద్ ఏసీపీ ప్రకాశ్​ రెడ్డి హెచ్చరించారు. షాద్​నగర్, చేవెళ్ల నియోజకవర్గంలో డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.

Telangana news
రంగారెడ్డి వార్తలు

రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ డీసీసీ ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్స్​లో పోలీసు, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాల డీలర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు. షాద్ నగర్, చేవెళ్ల నియోజకవర్గంలోని డీలర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు, ఇతర అధికారులు తరుచూ తనిఖీలు చేస్తామని డీసీపీ తెలిపారు. గతేడాది షాద్​నగర్​ ప్రాంతంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న నలుగురు వ్యాపారులపై పీడీ యాక్టు నమోదు చేశామని వెల్లడించారు. ఈ కేసులో పట్టుబడిన వారి వాహనాలతోపాటు పాస్​పోర్టు సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో షాద్​నగర్, చేవెళ్ల ఏసీపీలు కుషాల్కర్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Minister Harish Rao: వరికి బదులు పత్తి, కంది సాగు చేయండి: హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.