ETV Bharat / state

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితారెడ్డి

author img

By

Published : Dec 5, 2022, 7:55 PM IST

Minister Sabitha Indra Reddy
Minister Sabitha Indra Reddy

Minister Sabitha Reddy Initiated Many Development Programs: రంగారెడ్డి జిల్లాలోని కుర్మల్​గూడ 10వ డివిజన్​లో అభివృద్ధి పనులను, 28వ డివిజన్​లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మన ఊరు-మనబడి కింద మంజూరైన స్కూల్స్​ను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

'పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితారెడ్డి'

Minister Sabitha Reddy Initiated Many Development Programs: బడంగ్​పేట్ మున్సిపల్ కార్పొరేషన్​లోని కుర్మల్​గూడ 10వ డివిజన్​లో రూ. 2కోట్ల 40 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం 28వ డివిజన్​లో కూడా రూ. 3కోట్లతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ జాయిన్ కావడం జరిగింది.

వివిధ కార్యక్రమాలకు ఫౌండేషన్ వేయడం జరిగింది. వార్డ్ నెంబర్ 10లో కొన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దానితో పాటు బడంగ్​పేట్​లో కార్పొరేషన్​కి సంబంధించి బడంగ్​పేట్​లో ఏదైతే గవర్నమెంట్ స్కూల్ రన్​ అవుతా ఉందో హైస్కూల్ నడుస్తూందో దానికి సంబంధించి, అక్కడ గ్రౌండ్ అనేది లేకుండా అయిపోయింది. భవిష్యత్తులో పిల్లలకి ప్లే గ్రౌండ్​ అనేది చాలా అవసరం కాబట్టి, ఇక్కడ ఎలాగో హాస్పిటల్​కి ఇద్ధామని అనుకున్నాము. భవిష్యత్తులో హాస్పిటల్​కి ఎక్కడైనా ఎలాట్​ చేద్దాము. పక్కనే గ్రౌండ్​ ఉంది. పక్కన గ్రంథాలయం వచ్చింది కాబట్టి, స్కూల్​ ఉంటే పిల్లలకు మోటివేషన్​గా ఉంటుందని ఆలోచనతో ఇక్కడ కట్టాలని మొదలుపెట్టినాం. దీనికి సీఎస్ఆర్ ఫండ్స్ కింద మేఘా సంస్థ వాళ్లు నిధులు ఇస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాదాపుగా 3 నుంచి 4కోట్లు ఖర్చు పెట్టి కట్టాలని నిర్ణయం తీసుకున్నాను. -సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి

మన ఊరు-మనబడి కింద మంజూరైన స్కూల్స్​ను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడం కోసం చెరువులను సుందరీకరిస్తున్నామని ఆమె తెలిపారు. చెరువుల్లో మురికి నీరు చేరకుండా తగిన చర్యలు చేపడతామని అన్నారు. కాలనీలో ఉన్న అన్ని సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.