ETV Bharat / state

విద్యార్థులకు అలర్ట్​.. ఆ రోజు నుంచే ఇంజినీరింగ్​ మొదటి సంవత్సరం తరగతులు

author img

By

Published : Mar 26, 2022, 12:17 PM IST

Engineering courses classes start date: దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యాకోర్సులకు రానున్న విద్యాసంవత్సరం క్యాలెండర్​ను ఏఐసీటీఈ ప్రకటించింది. ఇంజినీరింగ్​ సహా ఇతర సాంకేతిక విద్యాకోర్సుల మొదటి సంవత్సర తరగతులను అక్టోబరు 25లోగా ప్రారంభించాలని స్పష్టం చేసింది. సెప్టెంబరు 15 నాటికి ప్రస్తుతం సాంకేతిక కోర్సులు కొనసాగిస్తున్న విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని సూచించింది.

engineering courses in telangana
తెలంగాణలో ఇంజినీరింగ్​ తరగతులు 2022

Engineering courses classes start date: ఇంజినీరింగ్‌ సహా ఇతర సాంకేతిక విద్యా కోర్సుల మొదటి సంవత్సరం తరగతులు అక్టోబరు 25లోగా ప్రారంభం కావాలని ఏఐసీటీఈ నిర్దేశించింది. ఈమేరకు సాంకేతిక విద్యా కోర్సులకు రానున్న విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను ప్రకటించింది. కళాశాలలు, కోర్సులకు అనుమతుల ప్రక్రియ జులై 10నాటికి పూర్తవుతుంది. అభ్యంతరాలు, అప్పీళ్లను జులై 30 నాటికి పరిష్కరించాలని పేర్కొంది. విశ్వవిద్యాలయాలు ఆగస్టు 31 నాటికి కళాశాలలు, కోర్సులకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది.

రెండు, ఆపై సంవత్సరాల విద్యార్థులకు సెప్టెంబరు 15 నాటికి తరగతులు ప్రారంభం కావాలని ఏఐసీటీఐ పేర్కొంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు అక్టోబరు 10 లోగా ఇండక్షన్ కార్యక్రమం చేపట్టాలని తెలిపింది. అక్టోబరు 20 నాటికి సీటు రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు వెనక్కి ఇస్తారు. సీట్లు మిగిలితే అక్టోబరు 25నాటికి మళ్లీ భర్తీ చేసి.. మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించాలి. పాలిటెక్నిక్ డిప్లొమా హోల్టర్లు తదితరులు లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలను అక్టోబరు 20లోగా పూర్తి చేయాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: Paddy Procurement: 'ఉగాది తర్వాత కేంద్రంపై ఉద్ధృత పోరాటం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.