ETV Bharat / state

'ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులు'

author img

By

Published : Dec 18, 2019, 12:02 AM IST

Education minister sabitha in kadthal
డ్తాల్ మండల కేంద్రంలో విద్యాశాఖ మంత్రి

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నామని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో పర్యటించి ఆమె.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హనుమాస్ పల్లిలో 11 కేవీ విద్యుత్ నియంత్రణ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఇదే ప్రాంతానికి చెందిన కొంతమంది ఎన్నారైలు, అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళా, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం నీటిశుద్ధి కేంద్రాన్ని, ఎమ్మార్సీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగర్​కర్నూల్​ ఎంపీ పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్ అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కడ్తాల్ మండల కేంద్రంలో విద్యాశాఖ మంత్రి

ఇదీ చూడండి: ఆగని రాక్షసత్వం: మతిలేని యువతిపై అమానవీయకాండ!

Intro:tg_mbnr_09_17_manthri_paryatana_avb_ts10130
రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండల కేంద్రంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కడ్తల్ మండలం హనుమాస్ పల్లి గ్రామంలో 11కేవీ విద్యుత్ నియంత్రణ కేంద్రాన్ని ప్రారంభించారు, ఇదే ప్రాంతానికి చెందిన కొంతమంది ఎన్నారైలు, అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళా ను, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం నీటిశుద్ధి కేంద్రాన్ని, ఎమ్మార్సీ భవనాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రంగారెడ్డి జిల్లా జడ్పి చైర్పర్సన్ అనితరెడ్డి, తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని అభివృద్ధి పనులు ప్రారంభించారు.


Body:ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగాబాలిక విద్యకు కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రవేటు పాఠశాలల స్థాయిని మించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన ఎన్నారై సభ్యులు తాము ప్రభుత్వ పాఠశాలలో చదివి వారు పడిన కష్టాలను ప్రస్తుతం చదువుతున్న చిన్నారులు పడొద్దు అనే సదుద్దేశంతో చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అని అన్నారు. బాలికలు ఏవైనా ప్రమాదాలు జరిగే సమయంలో 100, 112 నెంబర్లను సంప్రదించాలని వివరించారు. కడ్తల్ మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.


Conclusion:నామని హరిశ్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.