ETV Bharat / state

వస్త్రపరిశ్రమ సమస్యలపై నివేదిక ఇవ్వండి : తుమ్మల

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 15, 2024, 8:05 PM IST

Updated : Jan 15, 2024, 8:52 PM IST

Textile Industry Temporarily Closed Issue in Sircilla
Minister Thummala React on Garment industry Issue

Minister Thummala React on Garment industry Issue in Sircilla : రాజన్న సిరిసిల్లలోని వస్త్రపరిశ్రమలో మళ్లీ సంక్షోభం ఏర్పడింది. దీంతో యాజమానులు నిరవధికంగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి టెక్స్​టైల్​ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే వస్త్రపరిశ్రమ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.

Minister Thummala React on Garment industry Issue in Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్రపరిశ్రమను నిరవధికంగా మూసివేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) స్పందించారు. పరిశ్రమను మూసివేయడానికి కారణాలేమిటో అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అందించాల్సిన సాయాన్ని ఇచ్చేలా అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు రాకపోవడంతో నేతన్నలు పరిశ్రమ మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రాలకు సంబంధించిన బిల్లుల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో యజమానులు పెట్టుబడులు పెట్టి వస్త్రాలను ఉత్పత్తి కొనసాగించలేమని తేల్చి చెబుతున్నారు.

సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి తుమ్మల

Textile Industry Temporarily Closed Issue in Sircilla : టెక్స్ టైల్ పార్కు(Text Tile Park in Sircilla)కు, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమాన ఆర్డర్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. కేవలం 600లోపు మగ్గాలున్న టెక్స్‌టైల్ పార్కుకు, 25,000 మగ్గాలకు మించి ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమాన ఆర్డర్లు ఇస్తామని చెప్పడాన్ని పాలిస్టర్‌ పరిశ్రమ యజమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధానం వల్ల వందలాది పరిశ్రమలు మూసుకోవలసిన పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బతుకమ్మ చీరల ఆర్డర్లు ముగిసినప్పటికీ పరిశ్రమలు నెమ్మదిగా సాగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. పాలిస్టర్​ ధరకు కాంగ్రెస్​ సర్కార్​ గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్​ చేస్తున్నారు. యాజమానులు తీసుకున్న నిర్ణయం వలన ఆ పరిశ్రమ ఆధారంగా జీవిస్తున్న కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. తక్షణమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వాపోయారు.

Thummala Reaction on Text Tile Problems in Telangana : యాజమానుల తీసుకున్న నిర్ణయంపై మంత్రి తుమ్మల స్పందించి కార్మికులకు అండగా నిలవాలని అధికారులకు తెలిపారు. పరిశ్రమ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర చేనేత శాఖ కమిషనర్‌(Commissioner of State Handloom Department) అలుగు వర్షిణిని ఆదేశించారు. పాలిస్టర్​ పరిశ్రమే కాకుండా ఇతర చేనేత పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు.

"పరిశ్రమ మూసివేతకు కారణాలు తెలుసుకున్నాను. ప్రభుత్వం తరఫున సాయం అందేలా అధికారులకు తెలియజేశాం. వస్త్ర పరిశ్రమపై సమగ్ర నివేదిక ఇవ్వాలి. కార్మికుల సమ్మెపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి. రాష్ట్రంలో ఇతర పరిశ్రమలపై కూడా అధ్యయనం చేయాలి." - తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి

మే నెలాఖరుకు సీతారామ ప్రాజెక్టు కాలువ పనులు పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పామాయిల్ సాగులో ప్రభుత్వ సంకల్పానికి అధికారులు చొరవ చూపాలి : తుమ్మల

Last Updated :Jan 15, 2024, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.