ETV Bharat / state

మే నెలాఖరుకు సీతారామ ప్రాజెక్టు కాలువ పనులు పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 10:10 PM IST

Tummala Nageswara Rao on sitarama Project
Minister Tummala Review Meeting

Minister Tummala Review Meeting on Irrigation Project in Telangana : నీటిపారుదల శాఖ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీతారామ ప్రాజెక్ట్‌ పనులు త్వరగతిన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Minister Tummala Review Meeting on Irrigation Project in Telangana : ఈ ఏడాది మే నెలాఖరికి సీతారామ ప్రాజెక్టు(Sitarama Project) కాలువ పనులు అన్నీ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీతారామ పనుల పురోగతి, చేపట్టాల్సిన కార్యాచరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తుమ్మల పలు కీలక సూచనలు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సాగు నీరందించే ఉద్దేశంతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుపై మంత్రులు సుదీర్ఘంగా సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నా విజయానికి విశ్రాంత ఉద్యోగుల కృషి మరవలేనిది : మంత్రి తుమ్మల

Minister Tummala Review on Irrigation Department : పనుల్లో వేగం పెంచితే ఈ ఏడాదిలోనే వైరా ప్రాజెక్టు, లంకా సాగర్, ఎన్నెస్పీ ఆయకట్టులోని సుమారు లక్షా 60 వేల ఎకరాలకు సాగు నీరు అందించే విధంగా పనులు పూర్తి చేయవచ్చని మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సుమారు రూ.7500 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మూడు పంప్ హౌస్‌లు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. ఏనుకూరు వద్ద లింకు కెనాల్(Enkur Link Canal Works) పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టి వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సుమారు రూ.70 కోట్లతో ఈ పనులు పూర్తి చేస్తే వచ్చే సీజన్‌లోనే వైరా ప్రాజెక్టు, లంకసాగర్, బేతుపల్లి పరిధిలో ఆయకట్టుకు నీరు అందించే అవకాశం ఉందన్నారు.

Tummala Nageswara Rao on sitarama Project : యాతాలకుంట భూసేకరణ పూర్తయితే సత్తుపల్లి టన్నెల్ ద్వారా లంకసాగర్, బేతుపల్లి కెనాల్‌కు ఈ సీజన్‌లోనే సాగునీరు అందించే అవకాశం ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. సీతారామ కాలువల పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మే నెలాఖరు అన్ని ప్రాంతాల్లో కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఏనుకూరు వద్ద కాలువ పనులు పూర్తి చేస్తే, వైరా ప్రాజెక్ట్ లింకు కెనాల్ కలిపే పనులకు మార్గం దొరుకుతుందని చెప్పారు. దీంతో ఈ పనులకు సంబంధించి వెంటనే టెండర్లు ఆహ్వానించాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి : మంత్రి తుమ్మల

పనులు వేగవంతం చేస్తే నిధులు విడుదల : సీతారామ ప్రాజెక్ట్‌ ద్వారా నీరు ఎన్నెస్పీ ఆయకట్టుకు నీరు అందించేందుకు మార్గం సుగమం అవుతుందని మంత్రి అన్నారు. లింకు కెనాల్ పనులు పూర్తి చేస్తే వైరా రిజర్వాయర్‌తో పాటు లంకాసాగర్‌(Lankasagar Project Works)కు నీరు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. సత్తుపల్లి ట్రంకు కెనాల్‌కు సంబంధించి భూ సేకరణకు చెల్లించాల్సిన రూ.12 కోట్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. భూసేకరణ నిధులు చెల్లించిన వెంటనే పనులు చేపడితే యాతాలకుంట ట్రంకు పనులు పూర్తి చేయవచ్చని సూచించారు. పాలేరు టన్నెల్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రాములోరి దయతో భద్రాద్రిని అభివృద్ధి చేస్తా : మంత్రి తుమ్మల

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల - మూడు ఫైళ్లపై సంతకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.