ETV Bharat / state

వాటి ద్వారా నేరాలు అరికట్టవచ్చు: సిరిసిల్ల ఎస్పీ

author img

By

Published : Dec 31, 2020, 8:14 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పపూర్ గ్రామంలో 42 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కెమెరాలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. అన్ని గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

cameras setup by community policing, were started by the rajanna sircilla sp
వాటి ద్వారా నేరాలు అరికట్టవచ్చు : జిల్లా ఎస్పీ

జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పపూర్ గ్రామంలో .. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా 42 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఇప్పటి వరకు జిల్లాలో 526 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఏర్పాటు చేసుకోండి

ఎల్లారెడ్డిపేట్ మండల పరిధిలో అన్ని గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీటి ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నేరాలను నివారించే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఒకవేళ దొంగతనం జరిగినా వీటి ద్వారా వారిని వెంటనే గుర్తించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ బన్సీలాల్ , ఎస్ఐ వెంకటకృష్ణ, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: భవిష్యత్తులో విదేశాలకు తెలంగాణ చేపలు: మంత్రి తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.