ETV Bharat / state

వేములవాడ ఆలయంలో కోడె హల్​చల్.. చలువ పందిరి ఎక్కి!

author img

By

Published : Feb 9, 2022, 3:23 PM IST

Vemulawada temple, rajanna temple
వేములవాడ ఆలయంలో కోడె హల్​చల్

Vemulawada temple : వేములవాడ ఆలయం కోడెమొక్కులకు ప్రసిద్ధి. కోరిన కోరికలు నెరవేరితే కోడె మొక్కును చెల్లించుకుంటారు. ఈ విధంగా మొక్కులు సాగుతుండగా ఓ కోడె హల్​చల్ చేసింది. చలువ పందిరిపైకి ఎక్కి ఇరుక్కుపోయింది.

Vemulawada temple : వేములవాడ ఆలయంలో ఓ కోడె... చలువ పందిరిపై పడి హల్​చల్ చేసింది. వేములవాడ ఆలయంలో కోడె మొక్కులకు ప్రసిద్ధి.. ఒక వైపు దర్శనం సాగుతుండగా మరోవైపు కోడె మొక్కులు సాగుతుంటాయి. సమ్మక్క సారక్క జాతర క్రమంలో భక్తులు ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో భక్తుల రద్దీ చూసి ఓ కోడె బెదిరిపోయింది.

మహిషాసురమర్దిని వెనుక మెట్లపై నుంచి భవనం పైకి ఎక్కిన కోడె... చలువ పందిరిపై దూకి... పైనే ఇరుక్కుపోయింది. దీనితో ఆ కోడెను జాగ్రత్తగా కిందికి దించేందుకు వైద్యుని సహాయం తీసుకున్నారు. కోడెకు ఎలాంటి గాయం కాకుండా.. చలువ పందిరి కింద ట్రాక్టర్ నిలిపి కోడెను కిందకు దించారు. కోడెను సురక్షితంగా కిందకు దించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

వేములవాడ ఆలయంలో కోడె హల్​చల్

ఇదీ చదవండి: ప్రధాని వ్యాఖ్యలపై తెరాస నిరసనల హోరు.. భగ్గుమన్న గులాబీదళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.