ETV Bharat / state

పోలీసులనే అవాక్కయ్యేలా చేసిన ఫిర్యాదు.. ఏంటంటే..

author img

By

Published : Apr 21, 2021, 9:27 PM IST

ఓ వ్యక్తి నెత్తుటి మరకలతో పోలీస్​ స్టేషన్​కు వచ్చాడు. హత్యా అభియోగంపై ఓ వ్యక్తిపై కేసు నమోదు చేయాలని మృతదేహంతో సహా ఠాణాకొచ్చాడు. కంప్లైంట్​ రాయమని పోలీసులను కోరాడు. ఉలిక్కిపడిన ఠాణాలోని రైటర్​.. ఫిర్యాదు నమోదు చేసుకోడానికి కేసు గురించి వివరాలు అడిగాడు. అతడు చెప్పిన సమాధానం విని అవాక్కయ్యారు. ఇంతకీ ఏమిటా ఘటన అంటే...

kodini champina
రాజన్న సిరిసిల్ల

కోడిని చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో జరిగింది. బండపల్లికి చెందిన గశికంటి రాజు తన కోడిని ట్రాక్టర్​తో గుద్ది చంపారని ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

ఇంతకు ముందు నాకు 20 వరకు కోళ్లు ఉండేవి. మా ఊళ్లో ఇసుక ట్రాక్టర్లు ఎక్కువగా తిరుగుతున్నాయి. చాలా కోళ్లు ట్రాక్టర్ల కిందపడి చనిపోయాయి. ఇది కూడా అలానే చనిపోయింది. ఉన్న ఒక్కటి కూడా పోయిందని.. ఆవేదనకు గురైన నేను ఈ కోడిని తీసుకుని ట్రాక్టర్​ డ్రైవర్​ ఇంటికెళ్లాను. వాళ్లు దురుసుగా మాట్లాడారు. కోడిని పట్టుకుని పోలీస్​ స్టేషన్​కు వచ్చాను. నాకు న్యాయం జరగాలని కోరుతున్నాను.

-గశికంటి రాజు, కోడి యజమాని

తన కోడిని చంపిన ట్రాక్టర్​ డ్రైవర్​పై కేసు నమోదు చేసుకోవాలని కోరాడు. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కోడిని చంపేశారని.. అందుకే పోలీస్​ స్టేషన్​ మెట్లు ఎక్కానని రాజు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు అవాక్కయ్యారు. అయితే కోడిని కోల్పోయిన రాజుకు ఏవిధంగా న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

కోడిన చంపిన వారిపై పోలీసులకు ఫిర్యాదు

ఇదీ చూడండి: కన్నతండ్రిపై తనయుడు వేట కొడవలితో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.