ETV Bharat / state

ఎస్బీఐ చోరీ కేసులో దర్యాప్తు వేగవంతం

author img

By

Published : Mar 27, 2021, 12:22 PM IST

గుంజపడుగు ఎస్బీఐ చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఇద్దరు ఐపీఎస్ అధికారులు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. పలు ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్​లను పరిశీలిస్తున్నారు.

SBI bank robbery, gunjapadugu news
ఎస్బీఐ బ్యాంక్ చోరీ, గుంజపడుగు చోరీ కేసు

పెద్దపెల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇద్దరు ఐపీఎస్ అధికారులు, రామగుండం కమిషనరేట్ సంబంధించి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. గుంజపడుగు బ్యాంక్ అధికారులను రామగుండం కమిషనరేట్ కార్యాలయానికి పిలిపించి వారి వేలి ముద్రలను తీసుకున్నారు.

దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ పైన నెంబర్​ను దొంగలు చెరిపివేశారు. ఎక్కడా కూడా ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనం జరిగింది. చోరీ అనంతరం దొంగలు మహారాష్ట్ర వైపు వెళ్లారు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుంజపడుగు నుంచి గోదావరిఖని, మంథని వరకు ఉన్న సీసీ ఫుటేజ్​లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. దొంగతనం జరిగిన సొమ్ముకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని రీజినల్ మేనేజర్ ఆనంద్ తెలిపారు.

ఇదీ చూడండి: గుంజపడుగులో బ్యాంకు చోరీ.. హార్డ్ డిస్క్ మాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.