ETV Bharat / state

ప్రభుత్వాలకు తెలియజేసేందుకే గంగపుత్ర దివస్ : సత్యం బెస్త

author img

By

Published : Nov 22, 2020, 4:12 AM IST

Updated : Nov 23, 2020, 1:48 AM IST

నవంబర్ 21 అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బపల్లి గ్రామంలో గంగపుత్ర జెండా ఆవిష్కరించారు. సనాతన సాంప్రదాయ మత్స్యకార కులం గంగపుత్రులే అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజెప్పేందుకే " గంగపుత్ర దివస్ " ఉత్సవాలు చేపట్టామని అఖిల భారత మహా సభ జాతీయ అధ్యక్షుడు సత్యం బెస్త వెల్లడించారు.

ప్రభుత్వాలకు ప్రభుత్వాలకు తెలియజేసేందుకే గంగపుత్ర దివస్ : సత్యం బెస్తచెప్పేందుకే గంగపుత్ర దివస్ : సత్యం బెస్త
ప్రభుత్వాలకు తెలియజేసేందుకే గంగపుత్ర దివస్ : సత్యం బెస్త

పెద్దపల్లి జిల్లా మంథని మండల పరిధిలోని దుబ్బపల్లి గ్రామంలో గంగపుత్ర దివస్ ఉత్సవాలు ఘనంగా జరిపారు. అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తమ కుల దైవం గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకున్నట్లు అఖిల భారత గంగపుత్ర మహాసభ జాతీయ అధ్యక్షుడు సత్యం బెస్త తెలిపారు.

గ్రామాలు సుభిక్షంగా ఉండాలి..

సకాలంలో వర్షాలు కురిసి గ్రామాలు సుభిక్షంగా ఉండాలని కుల దైవం గంగమ్మ తల్లిని కోరుకున్నట్లు తెలిపారు. పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధిలో ఉంటుందన్నారు. చెరువులు, కుంటలు నిండి గంగపుత్రులకు చేపలు బాగా పెరగాలని.. రైతులు మూడు పంటలు పండించాలని ఆయన ఆకాంక్షించారు. తాము గంగమ్మ తల్లి బిడ్డలం, గంగపుత్రులం వందల ఏళ్లుగా నిజాం సర్కార్ కంటే ముందు నుంచే చేపలు పట్టే కులస్తులమని ఆయన గుర్తు చేశారు. అందుకే తమ కుల ఉనికి, అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు గంగపుత్ర దివస్ నిర్వహించామన్నారు.

కేసీఆర్ సర్కార్ తమ న్యాయమైన హక్కులను అమలు అయ్యేలా చొరవ తీసుకోవాలని సత్యం కోరారు.

1. వెంటనే మత్స్య సహకార సంఘాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి.

2. ఒక్కో సహకార సొసైటీకి రూ. 10 లక్షల రివాల్వింగ్ ఫండ్ అందజేయాలి.

3. వడ్డీలేని రుణాలు అందజేయాలి.

4. ప్రత్యేక గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసి గంగపుత్ర మత్స్యకారులకు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాలి.

5. హైదరాబాద్ పరిధిలో సంప్రదాయ మత్స్యకారులకే సబ్సిడీతో మొబైల్ వాహనాలు అందించాలి.

6. ఏటా చేప పిల్లలకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే సహకార సొసైటీ ఖాతాల్లో జమచేయాలి.

కార్యక్రమంలో మహాసభ ఉపధ్యక్షుడు మాదరబోయిన నర్సయ్య గంగపుత్ర, దుబ్బపల్లి గ్రామ సర్పంచ్ నరేష్ రావు, బెస్తపల్లి సర్పంచ్ తోకల నర్సయ్య గంగపుత్ర, తోకల రమేష్ గంగపుత్ర, లక్ష్మినారాయణ గంగపుత్ర , దుబ్బపల్లి గంగపుత్ర బెస్త సంఘం నేతలు కాళ్ల లింగయ్య, కునారారపు లింగయ్య, శాఖపురం తిరుపతి , మహిళా నేతలు రాజమ్మ గంగపుత్ర, రాజలక్ష్మి, శంకరమ్మ, గంగక్క తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రభుత్వాలకు తెలియజేసేందుకే గంగపుత్ర దివస్ : సత్యం బెస్త

ఇవీ చూడండి : ఎంపీ కవితపై ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేసిన వీహెచ్​పీ

Last Updated : Nov 23, 2020, 1:48 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.