ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో 12 మందికి గాయాలు

author img

By

Published : Jan 11, 2020, 11:55 PM IST

టవేరా వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటన పెద్దపల్లి శివారులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో 12 మందికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో 12 మందికి గాయాలు

పెద్దపల్లి పట్టణ శివారులో రాజీవ్‌ రహదారి దాటుతున్న టవేరా వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ కుటుంబం... వేములవాడ దైవ దర్శనానికి వెళ్లి శనివారం సాయంత్రం తిరుగు పయణమయ్యారు. పెద్దపల్లి శివారులో రోడ్డు దాటుతుండగా... గోదావరిఖని వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. క్షతగాత్రులను స్థానికులు ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో 12 మందికి గాయాలు

ఇవీ చూడండి : 'హామీలు నెరవేర్చని తెరాసకు ఓటు అడిగే హక్కు ఎక్కడిది'

Intro:ఫైల్: TG_KRN_41_11_ROAD PRAMADAM_VIS_AV_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: పెద్ద పెళ్లి పట్టణ శివారులో రాజీవ్ రహదారి దాటుతున్న తవేరా కార్ వాహనాన్ని ఆర్టిసి బస్సు ఢీకొన్న ఘటనలో 12 మంది గాయాల పాలయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని ఒకే కుటుంబానికి చెందిన వారు శనివారం సాయంత్రం వేములవాడ దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. పెద్దపెల్లి శివారులోని రాజీవ్ రహదారి నుంచి మంథని వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా గోదావరిఖని వైపు నుంచి వస్తున్న ఆర్టిసి బస్సు టవేరా కారణం ఢీకొంది. దీంతో కార్ల ప్రయాణిస్తున్న వారందరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను ట్రాఫిక్ పోలీసులు తో పాటు స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.Body:లక్ష్మణ్Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.