ETV Bharat / state

భర్తకు గుండెపోటు.. భార్య సీపీఆర్‌ చేసినా దక్కని ప్రాణం

author img

By

Published : Dec 6, 2022, 10:22 AM IST

Wife does CPR to Husband in Nizamabad : భార్య కళ్లెదుటే భర్త గుండెపోటుకు గురై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని సిరకొండ మండలం చౌరస్తాలో చోటుచేసుకుంది. అప్పటివరకు సరదాగా మాట్లాడిన భర్త ఉన్నట్టుండి అచేతనంగా పడిపోవడంతో.. భర్త ప్రాణాన్ని కాపాడుకోవడానికి భార్య చేసిన ప్రయత్నం చుట్టుపక్కల వారిని కంట తడి పెట్టించింది. సీపీఆర్ చేసినా ఆ మహిళ తన భర్తను కాపాడుకోలేకపోయింది.

HEART ATTACK
HEART ATTACK

Wife does CPR to Husband in Nizamabad : భార్య కళ్లెదుటే భర్త గుండెపోటుకు గురై కుప్పకూలి.. ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన ఇది. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం కొండూరు గిర్ని చౌరస్తాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకొంది. అంతవరకు సరదాగా మాట్లాడిన భర్త ఉన్నట్టుండి అచేతనంగా పడిపోవడంతో.. అతన్ని కాపాడుకోవడానికి ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న ఆమె పడిన వేదన చూపరులను కంటతడి పెట్టించింది. ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన సాగర్‌ (40) ట్యాక్సీడ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య వాసవి గ్రామంలో ఆశా కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తున్నారు.

సోమవారం ఉదయం సిరికొండ పీహెచ్‌సీలో సమావేశం ఉండగా తన ద్విచక్రవాహనంపై ఆయన భార్యను తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి వెళ్లే సమయంలో గిర్ని చౌరస్తా వద్ద ఆమెను దింపి పక్కనేఉన్న పెట్రోల్‌ బంకులోకి వెళ్తుండగా ఒక్కసారిగా వాహనంపై నుంచి స్పృహతప్పి పడిపోయారు. గుండెపోటుకు గురైనట్లు గుర్తించిన ఆమె వెంటనే సీపీఆర్‌ (కార్డియోపల్మనరీ రిససిటేషన్‌) చేసి కాపాడేందుకు ప్రయత్నించారు. అనంతరం 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా సాగర్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.