ETV Bharat / state

KTR To Inaugurate Nizamabad IT Hub : నిజామాబాద్​లో​ ఐటీ టవర్​ను ప్రారంభించిన కేటీఆర్.. నిరుద్యోగులకు హామీ​

author img

By

Published : Aug 9, 2023, 4:01 PM IST

Updated : Aug 9, 2023, 4:38 PM IST

Nizamabad IT Tower
KTR To Inaugurate Nizamabad IT Hub

KTR To Inaugurate Nizamabad IT Hub : రాష్ట్రవ్యాప్తంగా ఐటీ హబ్​లను బలోపేతం చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు. నిజామాబాద్​లో నిర్మించిన ఐటీ టవర్​ను కేటీఆర్​ ప్రారంభించారు. వీటితో పాటు ఐటీ హబ్​లోని వివిధ కంపెనీలను కూడా ఆయన ప్రారంభించారు. అలాగే నిజామాబాద్​ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని.. వాటికి ప్రారంభోత్సవం చేశారు.

KTR To Inaugurate Nizamabad IT Hub : రాష్ట్రంలో ఐటీ(IT) రంగాన్ని హైదరాబాద్​ నగరానికే పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా వ్యాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా నేడు నిజామాబాద్​లో నిర్మించిన ఐటీ టవర్(IT Towers)​ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR)​ ప్రారంభించారు. వీటితో పాటు ఐటీ హబ్​లోని వివిధ కంపెనీలను కూడా ఆయన ప్రారంభించారు. అలాగే నిజామాబాద్​ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని.. వాటికి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్​తో పాటు మంత్రి ప్రశాంత్​ రెడ్డి, ఎంపీ సురేశ్​ రెడ్డి, టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్​ గోవర్ధన్​ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్​ విద్యార్థులతో ముచ్చటించి.. వారికి ల్యాప్​టాప్​ను అందించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఐటీ హబ్​లను బలోపేతం చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రానికి మరిన్ని కొత్త కంపెనీలను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. వీటన్నింటిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకు ముందు ఉపాధి, శిక్షణ సంస్థ- న్యాక్​ భవనాన్ని మంత్రి కేటీఆర్​ ప్రారంభించి.. అనంతరం బాసర ట్రిపుల్​ ఐటీ ఇన్నోవేషన్​ హబ్​, వివిధ కంపెనీలను సైతం ప్రారంభించారు. నిజామాబాద్​ జిల్లాలో మినీ ట్యాంక్​బండ్​గా రఘునాథ చెరువును ప్రారంభించారు. 3 వైకుంఠ ధామాలు, సమీకృత మార్కెట్​, నిజామాబాద్​ మున్సిపల్​ నూతన భవనం, వర్ని రోడ్డులో ఉన్న నూతన వైకుంఠ ధామం ప్రారంభించారు. అనంతరం పాలిటెక్నిక్​ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు.

Siddipet IT Hub : అద్భుతంగా సిద్దిపేట ఐటీ హబ్.. ఫొటోలు చూశారా..?

Nizamabad IT Tower : ఇప్పటికే దేశానికి ఐటీ నగరంగా బెంగళూరును మించి హైదరాబాద్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. భాగ్యనగరంతో పాటు ఐటీ అన్ని జిల్లాల్లో విస్తరించాలనే ఉద్దేశంతో కరీంనగర్​, వరంగల్​, మహబూబ్​నగర్​, సిద్దిపేట జిల్లాల్లో ఐటీ హబ్​లను మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. ఇప్పటికే ప్రారంభించిన ఈ ఐటీ టవర్లలో పలు అంతర్జాతీయ కంపెనీలు తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. వీటితో పాటు వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. నిజామాబాద్​లో ప్రారంభించిన ఐటీ టవర్​లో టీ-హబ్(T-HUB)​, టాస్క్​ సెంటర్లు సైతం ఉన్నాయి.

Hyderabad as Robo Hub : రోబో హబ్​గా హైదరాబాద్.. టీ హబ్ తరహాలో 'ట్రిక్స్'

Nizamabad IT Hub : ఈ నిజామాబాద్​ ఐటీ టవర్స్(Nizamabad IT Tower)​లో 750 మంది పని చేయవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 15 కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. నిజామాబాద్​లో ఏర్పాటు చేసిన ఐటీ హబ్​పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రతి నెల ఒక జాబ్​ మేళా ఉండేలా చర్యలు తీసుకున్నామని.. అమెజాన్​, గూగుల్​, ఐబీఎం, టెక్​ మహీంద్రా వంటి సుమారు 52 అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలను నిర్వర్తించనున్నాయని తెలిపారు.

KTR To Inaugurate Nizamabad IT Hub : నిజామాబాద్​లో​ ఐటీ టవర్​ను ప్రారంభించిన కేటీఆర్.. నిరుద్యోగులకు హామీ​

Nizamabad IT Hub Drone Visuals : నేడు నిజామాబాద్​ ఐటీ హబ్ ప్రారంభోత్సవం..​ డ్రోన్​ విజువల్స్​ చూస్తే వావ్​ అనాల్సిందే..

Robotics Service in Hyderabad : రోబోటిక్స్‌కు కేరాఫ్​ అడ్రస్​గా హైదరాబాద్​

Last Updated :Aug 9, 2023, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.