ETV Bharat / state

Nizamabad IT HUB Inauguration : ప్రారంభోత్సవానికి ముస్తాబైన నిజామాబాద్ ఐటీ హబ్

author img

By

Published : Aug 8, 2023, 1:39 PM IST

MLC Kavitha On Nizamabad IT HUB
MLC Kavitha On Nizamabad IT HUB

Nizamabad IT HUB Inauguration : తెలంగాణ సర్కార్ ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా వ్యాప్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కరీంనగర్, వరంగల్, మహబూబ్​నగర్​, సిద్దిపేట జిల్లాల్లో ఐటీ హబ్​లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇక ఇప్పుడు తాజాగా నిజామాబాద్​ ఐటీ హబ్​ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

Nizamabad IT HUB Inauguration : మొన్నటిదాకా ఐటీ ఇండస్ట్రీ అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే అనుకునేవారు. కానీ, ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ విస్తరించేందుకు కేసీఆర్ సర్కార్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే కరీంనగర్, వరంగల్, మహబూబ్​నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఐటీ హబ్​లను నిర్మించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఐటీ టవర్లలో(Telangana IT Hubs) పలు అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వేల మంది యువత ఉపాధి పొందుతున్నారు. ఈ ఐటీ హబ్​లలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలకు ముందుకు వస్తున్నాయి. ఐటీ రంగాన్ని మరింత విస్తరించే క్రమంలో తాజాగా నిజామాబాద్​లోనూ ఓ ఐటీ హబ్​ను నిర్మించారు. ఇక ఇప్పుడు ఈ ఐటీ హబ్​ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది.

KTR Inaugurates Nizamabad IT Hub : నిజామాబాద్​ ఐటీ హబ్​ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం రోజున ప్రారంభించనున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. "ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరించే కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్​ను ప్రారంభించబోతున్నాను. ఈ టవర్​లో టీ-హబ్, టాస్క్​ సెంటర్లు కూడా ఉన్నాయి. ఇవి యువత ఆవిష్కరణలు చేసే దిశగా వారికి ప్రోత్సాహం అందించనున్నాయి." అని కేటీఆర్ ట్వీట్(KTR Tweet Today) చేశారు.

  • I will be inaugurating a new IT Hub in Nizamabad city tomorrow as part of our efforts to take IT sector to Tier 2 cities & towns 😊

    The IT Hub will also have an embedded T-Hub and TASK centre to help youngsters innovate and upskill

    Giving wings to the aspirations of the youth… pic.twitter.com/U0br4mJ3yn

    — KTR (@KTRBRS) August 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Siddipet IT Tower Inauguration : సిద్దిపేట సిగలో మరో మణిహారం.. రేపే ఐటీ హబ్ ప్రారంభం

IT HUB Inauguration in Nizamabad : మరోవైపు నిజామాబాద్ ఐటీ హబ్​ను కేటీఆర్ ప్రారంభిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha On Nizamabad IT HUB) తెలిపారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నిజామాబాద్ ఐటీ హబ్​ను ఎమ్మెల్యే బిగాల గణేశ్​ గుప్తా, ఆర్టీసీ ఛైర‌్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్​లతో కలిసి ఎమ్మెల్సీ సందర్శించారు. 750 మంది పని చేసే సామర్థ్యంతో ఐటీ టవర్​ను నిర్మించామని.. ఇప్పటికే 15 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. ఇటీవల ఉద్యోగ మేళాలో 280 మందికి ఆయా కంపెనీలు నియామక ఉత్తర్వులు ఇచ్చాయని చెప్పారు. 200 మంది ఉద్యోగాల్లో చేరేందుకు సంసిద్ధత తెలిపారని పేర్కొన్నారు. వికలాంగ అభ్యర్థులకు ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వ్ చేశామని వివరించారు.

ఐటీ హబ్​కు టాస్క్‌ నోడల్‌ ఏజెన్సీగా పని చేస్తుందని చెప్పిన కవిత.. టాస్క్‌ ఆధ్వర్యంలో శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్​లో ప్రతి నెల ఒక జాబ్ మేళా (Job Mela in Nizamabad) ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే ఈ నెల 29వ తేదీన మరో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని.. అమెజాన్, హెచ్​డీఎఫ్​సీ, గూగుల్, టెక్ మహీంద్రా, ఐబీఏం వంటి 52 అంతర్జాతీయ కంపెనీలు మేళాకు వస్తున్నాయని చెప్పారు. ఐటీ టవర్​తో పాటు నాక్‌ నూతన భవనం, నూతన మున్సిపల్‌ కార్పొరేషన్ భవనం, మూడు వైకుంఠధామాలు, మినీ ట్యాంక్‌ బండ్​లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. అనంతరం పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

Siddipet IT Hub : అద్భుతంగా సిద్దిపేట ఐటీ హబ్.. ఫొటోలు చూశారా..?

Nizamabad IT hub : 'నిజామాబాద్‌ ఐటీ హబ్‌లో గ్లోబల్ లాజిక్ సంస్థ పెట్టుబడులు..! మహిళలకే పెద్దపీట'

Siddipet IT Hub Inauguration : 'తెలంగాణ మోడల్‌ అంటే సమగ్ర, సమ్మిళిత, సమీకృత, సమతుల్య అభివృద్ధి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.