ETV Bharat / state

'అక్రమ మైనింగ్ చేస్తే ఉపేక్షించేది లేదు' - మంత్రి జూపల్లి స్ట్రాంగ్ వార్నింగ్

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 10:24 PM IST

Minister Jupally Krishna Rao
Minister Jupally Krishna Rao Fire for Illegal Mining in Nizamabad

Minister Jupally Krishna Rao Fire for Illegal Mining in Nizamabad : అక్రమ మైనింగ్ చేస్తే ఉపేక్షించేది లేదని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. రెండేళ్లుగా మైనింగ్ బ్లాస్టింగ్స్, అక్రమ మైనింగ్ జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులపై సీరియస్ అయ్యారు. అనంతరం నిజామాబాద్ కలెక్టరేట్​లో జరిగిన ప్రజాపాలన ఏర్పాట్ల సమీక్షలో మాట్లాడారు.

Minister Jupally Krishna Rao Fire for Illegal Mining in Nizamabad : ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలకు నష్టం కలిగించే రీతిలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్(Illegal Mining)​ను ఉపేక్షించేది లేదని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ప్రజా పాలన కార్యక్రమంపై నిజామాబాద్ కలెక్టరేట్​లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన మైనింగ్ బ్లాస్టింగ్​పై మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishnarao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్ష కోసం నిజామాబాద్​కు వస్తుండగా కామారెడ్డిలో మాచారెడ్డి ఉమ్మడి మండలంలోని మంథని, దేవునిపల్లిలలో అక్రమ మైనింగ్ గురించి ఫిర్యాదు చేశారని చెప్పారు. భారీ పేలుళ్ల కారణంగా వందలాది బోరు బావులు, నివాస గృహాలు దెబ్బతిన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు.

రెండేళ్లుగా అక్రమ మైనింగ్, బ్లాస్టింగ్స్(Blasting) జరుగుతుంటే ఎందుకు చర్యలు చేపట్టలేదంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారుల తీరుపై మండిపడ్డారు. తక్షణమే మైనింగ్ కారణంగా నష్టపోయిన బాధితులకు మైనింగ్ యాజమాన్యం ద్వారా రికవరీ చేసి పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నుంచి విజిలెన్స్ బృందాన్ని సైతం పంపుతామని అన్నారు.

ప్రజాపాలన కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు : ప్రజా పాలన(Public Governence) కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు ముందే ప్రజలకు చేరేలా చూడాలని, తద్వారా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్​లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు.

"రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ప్రకారం ఈ నెల 28వ తేదీ నుంచి ఆరు గ్యారంటీల అమలు కోసం యావత్ రాష్ట్రంలో ప్రతీ పేద వాడికీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఈ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దరఖాస్తులు ఇవ్వడం కోసం ఒక ప్రత్యేక కార్యచరణ రూపొందించడం జరిగింది. ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. ఇందులో ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా అధికారులే అడ్వాన్స్​డ్ సమాచారం అందిస్తారు. ఎలా అంటే ఏ గ్రామంలో ఏ రోజు ఎవరు ఉంటారో అనేది ఇందులో ఉంటుంది." - జూపల్లి కృష్ణారావు, మంత్రి

'అక్రమ మైనింగ్ చేస్తే ఉపేక్షించేది లేదు' - మంత్రి జూపల్లి స్ట్రాంగ్ వార్నింగ్

Minister Jupally Comments : అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ప్రజా పాలన గురించి ప్రజలకు సమాచారంతో పాటు ముందే దరఖాస్తులు అందించాలని అన్నారు. ప్రజలకు మనం సేవకులుగా భావించి పని చేయాలని, ప్రజలతో మర్యాదగా మేసులుకోవాలని చెప్పారు. అంతేగానీ కసురుకోవడం, ఈసడించుకోవడం, నిర్లక్ష్యం వహించడం వంటివి అధికారులు చేయవద్దన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలని అధికారులకు వివరించారు.

తొమ్మిదిన్నరేళ్ల అస్తవ్యస్త పాలనను చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం : మంత్రి జూపల్లి

'బీఆర్ఎస్ హయాంలో కుంటుపడ్డ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మళ్లీ గాడినపట్టే బాధ్యత తీసుకున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.