ETV Bharat / state

CM KCR Tributes to Vemula Manjulamma Death : మంత్రి ప్రశాంత్‌రెడ్డి తల్లి మంజులమ్మ పార్థివదేహానికి సీఎం కేసీఆర్​ నివాళులు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 1:30 PM IST

CM KCR pays tributes to Vemula Manjulamma
CM KCR pays tributes to Vemula Manjulamma Death

CM KCR Tributes to Vemula Manjulamma Death : మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డిని సీఎం కేసీఆర్​ పరామర్శించారు. మంత్రి తల్లి వేముల మంజులమ్మ(76) అనారోగ్యంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ క్రమంలో నేడు మంత్రి స్వగ్రామమైన నిజామాబాద్​ జిల్లా వేల్పూర్​కు సీఎం కేసీఆర్​ వెళ్లారు. అక్కడ మంజులమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

CM KCR Tributes to Vemula Manjulamma Death : రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డిని సీఎం కేసీఆర్​ పరామర్శించారు. ప్రశాంత్​ రెడ్డి తల్లి వేముల మంజులమ్మ(76) అనారోగ్యంతో.. హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ క్రమంలో నేడు మంత్రి స్వగ్రామమైన నిజామాబాద్​ జిల్లా వేల్పూర్​కు సీఎం కేసీఆర్​ వెళ్లారు. అక్కడ మంజులమ్మ భౌతికకాయానికి నివాళులు(CM KCR Pays Tribute to Manjulamma) అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. సీఎం వెంట స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి, మంత్రులు శ్రీనివాస్​ గౌడ్​, ఇంద్రకరణ్​ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోశ్​ కుమార్​, ఎమ్మెల్సీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉదయం 9.50 గంటలకే వేముల ప్రశాంత్​ రెడ్డి ఇంటికి చేరుకోవాల్సిన సీఎం కేసీఆర్​ మధ్యాహ్నం 12.30 గంటలకు అక్కడకు చేరుకున్నారు. ప్రగతి భవన్​ నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి వెళ్లారు.

వేముల మంజులమ్మ భర్త వేముల సురేందర్​ రెడ్డి తెలుగుదేశం హయాంలో నిజాం ఫ్యాక్టరీ ఛైర్మన్​గా పని చేశారు. ఆ తర్వాత టీఆర్​ఎస్​ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా విధులు నిర్వహించారు. తదనంతరం 2016లో ఆయన మృతి చెందగా.. ఇప్పుడు మంజులమ్మ మృతి చెందారు. ఆ దంపతులకు ప్రశాంత్​ రెడ్డితో పాటు మరో కుమారుడు శ్రీనివాస్​ రెడ్డి, కుమార్తె రాధిక ఉన్నారు.

Minister Prashanth Reddy VS MLA Bajireddy Govardhan : 'మంత్రిగారు.. మాకూ నిధులు కేటాయించండి..' అధికారపార్టీ నేతల మధ్య ఆసక్తికర సంభాషణ

CM KCR Recovered from Viral Fever : బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ దాదాపు 25 రోజుల తర్వాత బయటకు వచ్చి నిజామాబాద్​లోని మంత్రి ప్రశాంత్​రెడ్డి తల్లి మరణానికి నివాళులు అర్పించడానికి వెళ్లారు. వైరల్​ జ్వరంతో బాధపడిన కేసీఆర్​.. ఈ మధ్య కోలుకున్నారు. మరోవైపు ఆదివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. వైరల్​ ఫీవర్​తో బాధపడిన సీఎం కేసీఆర్‌కు ఛాతిలో సెకండరీ బ్యాక్టీరియల్​ ఇన్​ఫెక్షన్​ వచ్చింది. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కేసీఆర్​.. మెల్లిగా కోలుకున్నారు.

దీని కన్నా ముందు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత.. భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం వినాయక చతుర్ధి రోజు వినాయకుడి విగ్రహాన్ని ప్రగతి భవన్​లో ఏర్పాటు చేసి సీఎం కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాతి రోజు నుంచి సీఎం కేసీఆర్ బయటకు రాలేదు. నాలుగు రోజుల తర్వాత మంత్రి కేటీఆర్​ ట్వీట్​ చేసిన తర్వాత కేసీఆర్​ వైరల్​ జ్వరంతో బాధపడుతున్నారని అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఛాతిలో బ్యాక్టీరియా ఇన్​ఫెక్షన్​తో బాధపడ్డారు. ఇప్పుడు వాటి నుంచి కోలుకొని.. ఎన్నికల ప్రచారానికే సిద్ధమయ్యారు.

CM KCR Election Tour : సీఎం కేసీఅర్ ఎన్నికల సభల షెడ్యూల్ ఖరారు.. ఈనెల 15 నుంచి నవంబర్ 9 వరకు..

BRS Manifesto 2023 Release Date : ఈ నెల 15న బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో.. నవంబర్‌ 9న కేసీఆర్ నామినేషన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.