ETV Bharat / state

sister was missing Brother died : చెల్లి కనిపించకుండా పోయిందని.. గుండె పోటుతో అన్న మృతి.. ఎక్కడంటే?

author img

By

Published : Jul 11, 2023, 10:44 PM IST

sister was missing Brother died
sister was missing Brother died

sister was missing Brother died At Nizamabad : చిన్నప్పుడే తండ్రి దూరమయ్యాడు. తల్లి పాము కాటుతో మృతి చెందింది. నానమ్మ వద్దే అన్న, చెల్లెలు ఇద్దరు పెరిగారు. సోదరికి ఏ కష్టం రాకుండా.. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశాడు అన్నయ్య. పెళ్లి చేసి తల్లిదండ్రుల బాధ్యతను సైతం అన్ననే నెరవేర్చాడు. అనుకోకుండా ఆ కుటుంబంలో వచ్చిన చిన్న మనస్పర్ధతో కుమారుడితో పాటు చెల్లెలు కనిపించకుండా పోయింది. తన సోదరి కోసం అన్న వెతకని చోటు లేదు. దీంతో తీవ్ర మనోవేదనకులోనైన అన్న చివరికి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.

sister missing Brother died At Hanumanfara Nizamabad : అన్నా చెల్లెలు అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమైందే. చెల్లిలిని అల్లారుముద్దుగా చూసుకోవడం ప్రతి అన్నయ్యా చేసేదే. కానీ తల్లిదండ్రులు చిన్నప్పుడే దూరమైతే ఆ అన్నాచెల్లెలు బంధం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఎంతలా అంటే చెల్లెలికి చిన్న కష్టం వచ్చిన తట్టుకోలేనంతగా. అలాంటిది ఆ చెల్లెలు కనిపించకుండా పోతే ఆ అన్నయ్య పడే యాతన ఎలాంటిదో. నిజామాబాద్ జిల్లాలో ఓ అన్నయ్యకు కనిపించకుండా పోయిన ఓ చెల్లెలు ఇక రాదేమోనని గుండెపోటుకు గురై మృతి చెందాడు.

జిల్లాలోని నవీపేట మండలం హనుమాన్‌ఫారానికి చెందిన గంగమ్మ, భోజయ్యకు నరేశ్, అనిత సంతానం. ఇరవై ఏళ్ల క్రితం తల్లి గంగమ్మ పాముకాటుతో చనిపోయింది. తండ్రి సైతం కుటుంబానికి దూరమయ్యాడు. దీంతో చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరంగా పెరిగారు అన్నాచెల్లెలు. నానమ్మ వద్ద ఉంటూ చెల్లెలిని అల్లారు ముద్దుగా చూసుకున్నాడు ఆ అన్నయ్య. చిన్న కష్టం సైతం ఆమె దరి చేరకుండా కంటికి రెప్పల కాసుకున్నాడు. తల్లిదండ్రులు దూరమవడంతో అన్నయ్య చెల్లెలిని పెంచి పెద్ద చేశాడు.

విధికే కన్ను కుట్టినట్లుంది: తొమ్మిదేళ్ల కిందట నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన రాజుతో అనితకు వివాహం జరిపించి తల్లిదండ్రుల బాధ్యతను సైతం అన్నయ్యే నెరవేర్చాడు. చెల్లెలికి ఏడేళ్ల కొడుకు రేశ్వంత్ ఉన్నారు. ఆటో డ్రైవర్​గా పని చేసే నరేశ్​కు భార్య నవ్య, కొడుకు, కూతురు ఉన్నారు. తనతో పాటు తన చెల్లెలు జీవితం సైతం సంతోషంగా సాగిపోతుందని ఆ అన్నయ్య ఆనందంతో ఉన్నాడు. కానీ అంతా అనుకున్నట్టే జరిగితే విధి ఎలా ఊరుకుంటుంది. అందుకే అన్నా చెల్లెలి అనుబంధంపై కన్ను కుట్టిన ఆ విధి వారి జీవితాల్లో అనుకోని కల్లోలం సృష్టించింది.

చెల్లికోసం తిరగని చోటు లేదు: చెల్లెలు ఈనెల 2న తన భర్త, కొడుకుతో కలిసి అన్నయ్య వద్దకు వచ్చారు. భర్త రాజు అదే రోజు తిరిగి బైంసా వెళ్లిపోయారు. భర్త వెళ్లిన మరుసటి రోజు తాను కూడా వెళ్తానని అనడంతో స్వయంగా అన్నయ్యే నవీపేటలో బస్సు ఎక్కించారు. అయితే ఎంత సమయం గడిచినా చెల్లెలు, ఆమె కుమారుడు ఇంటికి చేరుకోలేదు. వారి ఆచూకీ కోసం నరేశ్ అదే పనిగా వెతికారు. హైదరాబాద్​లో ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లి వెతికినా కనిపించలేదు. చెల్లెలు కుటుంబం, తన కుటుంబం, బంధువులతో పాటు నరేశ్‌ సైతం విపరీతంగా చెల్లెలు కోసం వెతికారు.

చెల్లిపై బెంగతో మనోవేధనకు గురై..: పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఎక్కడా ఆమె జాడ దొరకలేదు. దీంతో అన్నయ్య కుమిలిపోయాడు. చెల్లెలు ఇక రాదనే బెంగతో ఆదివారం రాత్రి గుండె పోటుతో మృతి చెందాడు. వారం రోజుల పాటు చెల్లెలు కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అన్నయ్య మృత్యువాత పడ్డాడు. కనీసం ఆ అన్నయ్య కడసారి చూపునకు సైతం చెల్లెలు నోచుకోలేకపోయింది. ఈ హృదయవిదారక ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.