ETV Bharat / state

'పేదరికం డబ్బుతో కాదు.. గుణంతో వస్తుంది'

author img

By

Published : Mar 6, 2021, 2:20 PM IST

నిజామాబాద్ జిల్లాలో విద్యార్థులకు పిల్లల హక్కులు-ఉపయోగం అనే అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు జిల్లా న్యాయమూర్తి జస్టిస్ సాయిరమాదేవి, మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్, మేయర్ నీతూకిరణ్ పాల్గొన్నారు.

An awareness seminar on child rights-use was organized for students in Nizamabad district.
'పేదరికం డబ్బుతో కాదు.. గుణంతో వస్తుంది'

పేదరికం అనేది డబ్బుతో రాదని.. గుణంతో వస్తుందని మన గుణం మంచిగుంటే మనకన్నా గొప్పవారు ఎవరూ ఉండరని జిల్లా న్యాయమూర్తి సాయిరమాదేవి పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్వంలో విద్యార్థులకు పిల్లల హక్కులు-ఉపయోగం అనే అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

నాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ సదస్సులో విద్యార్థులకు బాలల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి జస్టిస్ సాయిరమాదేవి, మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్, మేయర్ నీతూకిరణ్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: మంత్రి ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.