ETV Bharat / state

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి అల్లోల

author img

By

Published : Jan 29, 2021, 6:00 PM IST

Minister Indrakaran  Reddy inaugurated several development works in Ola village in Kuntala Mandal of Nirmal district
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి అల్లోల

నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలో అంగన్​వాడీ కేంద్రం, సబ్​స్టేషన్​, రైతు వేదికను మంత్రి అల్లోల ప్రారంభించారు. 'రైతే రాజు' దిశగా అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ చేపడుతున్నారని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఉన్నారు.

నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా గ్రామంలోని అంగన్​వాడీ కేంద్రంను ప్రారంభించారు. అనంతరం సబ్​స్టేషన్​, రైతు వేదికను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

రెండు నెలలుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దిల్లీలో ధర్నాలు చేస్తున్నారని మంత్రి అన్నారు. 'రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక' అని దేశంలో పలువురు నాయకులు ఉపన్యాసాలు చేసి వదిలేస్తారు. తెలంగాణలో కేసీఆర్ మాత్రమే పట్టుదలతో రైతుల కోసం అభివృద్ధి పనులను చేపడుతూ.. ఆ దిశగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మండల సర్పంచ్​లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తెరాస కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ప్రజారోగ్య సంచాలకుడి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.