ETV Bharat / state

Kadem Project in Nirmal : వరద ముప్పును ముందే పసిగట్టేలా.. కడెం ప్రాజెక్టులో 5 గేజ్‌ కేంద్రాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2023, 9:35 AM IST

Kadem Project in Nirmal : భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని జీవించాల్సిన పరిస్థితి. ఎప్పుడు ప్రాజెక్టు గేట్లు ఊడిపోయి.. వరద తమను ముంచేస్తుందోనని భయం గుప్పిట్లో బతుకుతుంటారు అక్కడి జనం. ఈ నేపథ్యంలో వరద ముప్పును ముందే పసిగట్టే.. ప్రాజెక్టుకు వచ్చే వరదను ముందుగా అంచనా వేయడానికి 5 గేజ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా కేంద్రాలను నిర్మిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

Kadam Project వరద ముప్పు తెలిసేలా రూపొందిస్తున్న కడెం ప్రాజెక్టు

Kadem Project in Nirmal : నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు ఆకస్మిక వరదలతో పొంచి ఉన్న ముప్పుపై నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టు(National Hydrology Project)లో భాగంగా వరదను ముందుగా అంచనా వేసేందుకు కేంద్రాలను నిర్మిస్తున్నారు. ఆనకట్ట పటిష్టత, కొత్త స్పిల్‌వే, గేట్ల మార్పువంటి వాటిపై అధ్యయనాలు సాగుతుండగా దానికన్నా ముందు గేజ్‌ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

Kadem Project Damage : రెండేళ్లుగా కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు(Kadem Narayana Reddy Project)కు భారీ వరద వస్తుండగా గతేడాది ఒకానొక దశలో ఆనకట్ట తెగిపోతుందా అనేంత ఉత్కంఠ నెలకొంది. 1969లో పూర్తయిన ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 7.60 టీఎంసీలు కాగా 3.82 లక్షల క్యూసెక్కులు వరద దిగువకు వెళ్లే సామర్థ్యం ఉంది. పోయిన ఏడు 5.20 లక్షల క్యూసెక్కులు, ఈఏడాది 3.20 లక్షల క్యూసెక్కుల వరద రాగా దిగువకు విడుదల చేసేందుకు గేట్లు మొరాయించాయి. ఈ క్రమంలో వరద ప్రమాదకర స్థాయికి చేరక ముందే జలాశయాన్ని ఖాళీ చేస్తే గేట్ల నిర్వహణ సులువుగా చేపట్టవచ్చన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు.

Kadem Project Water Level : శాంతించిన కడెం జలాశయం.. ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం

Kadem Project Gates Repair : నిర్మల్‌ జిల్లాలో కడెం వాగు 86 కిలోమీటర్ల పొడవుండగా గోదావరిలో కలిసే ముందు ఆరు కిలోమీటర్ల ఎగువన వాగుపై ఆనకట్ట నిర్మించారు. కొండ ప్రాంతాలు, అడవుల నుంచి దాదాపు 457 మీటర్ల ఎత్తు నుంచి నీరు వేగంగా వస్తుండటంతో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. 2 వేల 590 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో క్యాచ్‌మెంట్‌ ఉండగా ఎగువన కురిసే వర్షం నీరు గంటలోనే ఈ ప్రాజెక్టును చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తేందుకు సమయం ఉండట్లేదని ఇంజినీర్లు చెబుతున్నారు. 18 గేట్లను పూర్తిగా ఎత్తినప్పటికీ 3.20 లక్షల క్యూసెక్కులు మాత్రమే దిగువకు వెళతాయని చెబుతున్నారు.

ఎగువ నుంచి అంతకన్నా ఎక్కువ వరద రావటమే ముప్పుగా మారింది. ఎగువన నుంచి వచ్చే వరద 26.25 కిలోమీటర్ల విస్తీర్ణంలో పరుచుకున్న వెనుక జలాలను తాకుతుంది. ప్రవాహం వచ్చే మూడు ప్రధాన మార్గాల వద్ద వరద వేగాన్ని, పరిమాణాన్ని గుర్తించేందుకు సెన్సార్లు ఏర్పాటు చేస్తారు. మరో రెండు సెన్సార్లను జలాశయం లోపలి భాగంలో, ఆనకట్ట దిగువన ఏర్పాటు చేయనున్నారు. ఈ సెన్సార్ల ద్వారా ప్రవాహాన్ని అంచనా వేసి ముందుగానే గేట్లు ఎత్తేందుకు వీలుంటుందని ఇంజినీర్లు సూచిస్తున్నారు.

Kadem Project Gates Repair : కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న కష్టకాలం .. విరిగిన మరో గేటు

Kadem Project Water Flood : కడెం జలాశయానికి పోటెత్తిన వరద.. పని చేయని 7 గేట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.