ETV Bharat / state

నిర్మల్​లో ఘనంగా దసరా వేడుకలు.. పాల్గొన్న మంత్రి

author img

By

Published : Oct 25, 2020, 9:59 PM IST

నిర్మల్​ జిల్లా కేంద్రంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి చేతుల మీదుగా రావణ దహన కార్యక్రమం నిర్వహించారు.

dussehra celebrations in nirmal district
నిర్మల్​లో ఘనంగా దసరా వేడుకలు.. పాల్గొన్న మంత్రి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్​పేట్ మహాలక్ష్మీ ఆలయం వద్ద దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ విజయ లక్ష్మీ, మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ముందున్న జమ్మి చెట్టుకు పూజలు జరిపారు.

ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే సంవత్సరం దసరా ఉత్సవాలను మరింత ఆకర్షణీయంగా జరుపుకునేందుకు అవసరమైన మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా రావణ దహన కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చదవండి: పెద్దల నిబంధనకు కట్టుబడి.. పండుగలు చేసుకోని ఓ గ్రామం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.