ETV Bharat / state

నిరాశ్రయులైన కుటుంబాన్ని ఆదుకున్న విద్యార్థి సంఘం నేత

author img

By

Published : May 11, 2020, 11:33 PM IST

కష్టకాలంలో ఉన్న ఓ కుటుంబానికి తెలంగాణ ఇంజినీరింగ్​ కళాశాలల విద్యార్థి సంఘం తమ వంతు సాయం అందించింది. నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో ఈదురుగాలుల వల్ల ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన కుటుంబానికి విదార్థి జేఏసీ నేతలు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు.

student jac help to poor people
నిరాశ్రయులకు విద్యార్థి సంఘం నేతల సాయం

నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో రెండు రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు ఓ ఇంటి గోడ కూలి, ఇంట్లో వస్తువులన్నీ తడిసి ముద్దై నిరాశ్రయులైన ఓ కుటుంబానికి విద్యార్థి సంఘం నాయకులు ఆదుకున్నారు. బాధితులను తెలంగాణ ఇంజినీరింగ్​ కళాశాలల విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు, తెరాస యువజన విభాగం రాష్ట్ర నాయకుడు శివంత్​రెడ్డి పరామర్శించారు.

బాధితులకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో స్థానిక వైస్​ ఎంపీపీ, వినతి శంకర్​, సర్పంచ్​ సంధ్య ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

నిరాశ్రయులకు విద్యార్థి సంఘం నేతల సాయం

ఇదీ చూడండి: 'కరోనా ఎక్కువ కాలం ఉంటే.. ఆ సంస్థల పని అంతే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.