ETV Bharat / state

మంచానికే పరిమితమైన భర్త... అమ్మలా మారిన భార్య

author img

By

Published : Dec 6, 2020, 12:42 PM IST

Updated : Dec 6, 2020, 1:30 PM IST

ఆమె పేరు అరుంధతి. భర్త చెన్నయ్య... ఓ ప్రైవేటు కళాశాలలో ప్రిన్సిపాల్. ఒక్కగానొక్క కొడుకు. ఇది చాలు జీవితం సాఫీగా సాగుతోందని చెప్పడానికి. కానీ బ్రెయిన్ స్ట్రోక్ ఆ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టేసింది. మంచానికే పరిమితమైన భర్తకు అన్నీ తానై అమ్మగా మారి కంటికి రెప్పలా కాపాడుతోంది నల్గొండ జిల్లాకు చెందిన అరుంధతి.

మంచానికే పరిమితమైన భర్త... అన్నీతానై అమ్మలా మారిన భార్య
మంచానికే పరిమితమైన భర్త... అన్నీతానై అమ్మలా మారిన భార్య

బ్రెయిన్ స్ట్రోక్​తో మంచానికే పరిమితమైన భర్తకు అన్నీతానై... అమ్మలా మారింది ఓ గృహిణి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన అరుంధతి, చెన్నయ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఆరేళ్ల కుమారుడు అధ్యాయన్ ఉన్నాడు.

బ్రెయిన్ స్ట్రోక్...

ఉన్నత చదువులు చదివిన చెన్నయ్య... హైదరాబాద్​లోని ఓ బీఈడీ కళాశాలలో ప్రిన్సిపల్​గా పనిచేస్తున్న సమయంలో 2017 ఫిబ్రవరి 7న తరగతి గదిలో బ్రెయిన్ స్ట్రోక్​తో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పట్నుంచి మంచానికే పరిమితమయ్యాడు. డబ్బు ఖర్చు చేస్తే మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

నెలకు రూ. లక్షా 30వేలు...

కుటుంబ సభ్యుల సహకారంతో సుమారు రూ. 20 లక్షలకు పైగానే చికిత్స కోసం ఖర్చు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. సంవత్సరం పాటు క్రమం తప్పకుండా చికిత్స అందిస్తే తన భర్త మామూలు మనిషి అవుతారని... అందుకు నెలకు రూ. లక్షా 30వేలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పినట్లు అరుంధతి తెలిపారు.

సాయం చేయండి...

కరోనా ప్రభావం వల్ల కుటుంబం గడవడం కష్టంగా ఉందని.. కొడుకుని కూడా చదివించే స్థితిలో తాను లేనని అరుంధతి వాపోయారు. తన పరిస్థితిని చూసైనా... అధికారులు స్పందించి ప్రభుత్వ పరంగా సాయం అందించాలని కోరుతున్నారు.

ఇప్పటికే మందుల కోసం నెలకు రూ. 15 వేలు ఖర్చు చేస్తున్నట్లు ఆమె వివరించారు. బీఎస్సీ కంప్యూటర్ పూర్తి చేసిన తనకు తగిన ఉద్యోగం అవకాశం కల్పించి ఆదుకోవాలని అరుంధతి కోరుతున్నారు. ఉపాధి కల్పిస్తే తన భర్తను తానే కాపాడుకుంటానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.

ఇదీ చూడండి:భారత్​ బంద్​కు కేసీఆర్ సంపూర్ణ మద్దతు

Last Updated : Dec 6, 2020, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.