ETV Bharat / state

మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు ఏం చెప్పిందంటే?

author img

By

Published : Oct 14, 2022, 11:55 AM IST

Updated : Oct 14, 2022, 2:58 PM IST

TS High Court hearing on Munugode voter list petition
మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు ఏం చెప్పిందంటే?

11:53 October 14

మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్‌పై విచారణ

TS High Court on Munugode voter list మునుగోడు ఓటర్ల నమోదులో అక్రమాలు జరిగాయని ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన భాజపా అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. పిటిషన్​పై విచారణ జరిపిన ధర్మాసనం సవరణ చేసిన ఓటర్ల జాబితాను సమర్పించాలని ఎన్నికల అధికారిని అదేశించగా.. నేడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆ జాబితాను హైకోర్టు సమర్పించారు. మునుగోడులో 2018 అక్టోబరు 12న ఓటర్లు 2,14,847 ఉన్నారని.. ఈనెల 11 నాటికి కొత్తగా వచ్చిన ఓట్లు మొత్తం కలిపి ఇప్పటి వరకు 2,38,759 అమోదం తెలిపామని ఆయన వివరించారు.

కొత్తగా 25,013 కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారని సీఈఓ వివరించారు. వీటిలో 12,249 కొత్త ఓటర్లకు అనుమతించి.. 7247 తిరస్కరించామని పేర్కొన్నారు. మరో 5,517 ఫారం 6లు పెండింగులో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. మునుగోడు ఓటరు జాబితా సవరణ నేటితో పూర్తవుతుందని చెప్పారు. మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్లు కనిపించడం లేదని సవరించిన ఓటరు జాబితా సమర్పించాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. వాటిపై సందేహం ఉంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించవచ్చుని పిటిషనర్ తరపు న్యాయవాదికి సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

అసలేం జరిగిదంటే: మునుగోడులో ఓట్ల నమోదుకు సంబంధించి హైకోర్టులో భాజపా రిట్‌ పిటిషన్ దాఖలు చేసింది. ఉపఎన్నికకు జులై 31 వరకు ఉన్న జాబితానే పరిగణించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. తక్కువ సమయంలోనే మునుగోడులో 25 వేల దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. ఫాం-6 కింద వచ్చిన దరఖాస్తుల్లో తప్పుడు ఓటర్లు ఉన్నారని ఆరోపించింది. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.

ఇవీ చూడండి:

కమల్ నుంచి రజనీ దాకా ఫిల్మ్ ఫేర్ కింగ్స్ వీరే

మోయలేని భారం మోపే వారే.. మోదీ: కేటీఆర్

Last Updated :Oct 14, 2022, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.