ETV Bharat / state

nagarjuna sagar boating: రేపటి నుంచే సాగర్​ నుంచి శ్రీశైలం బోట్​ ప్రయాణం

author img

By

Published : Nov 28, 2021, 7:17 PM IST

సాగర్​ నుంచి శ్రీశైలం వరకు లాంచీపై సాగిపోయే విహార యాత్రకు (nagarjuna sagar boating) సమయం ఆసన్నమైంది. సోమవారం సాగర్​ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం పారంభం కానుంది. గత రెండు నెలల కిందట ప్రారంభం కావాల్సిన లాంచీ ప్రయాణం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

nagarjuna sagar boating
nagarjuna sagar boating

Nagarjuna sagar boating: కృష్ణమ్మ చిరు అలలపై తేలుతూ.. ఒడ్డున ఉండే పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ.. జీవితంలో ఓ మధురానుభూతిగా నిలిచిపోయే... సాగర్​ శ్రీశైలం లాంచీ ప్రయాణానికి సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి నాగార్జున సాగర్​ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ప్రయాణానికి సిద్ధమైన లాంచీ
ప్రయాణానికి సిద్ధమైన లాంచీ

అయితే గత రెండు నెలల క్రితమే ప్రారంభం కావాల్సిన ఈ యాత్ర పర్యాటకులు ఆసక్తి చూపకపోవడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం బుకింగ్​లు రావడంతో అధికారులు యాత్రకు ముహూర్తం ఖరారు చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు నాగార్జున సాగర్​ నుంచి లాంచీ బయలుదేరనుంది.

టికెట్​ ఛార్జీలు ఇలా ఉన్నాయి

  • సాగర్​ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.1500 చార్జీ ఉంటుంది. (ఒక వైపునకు)
  • పిల్లలకు (4 ఏళ్ల నుంచి 12 సంవత్సరాలు) రూ. 1200
  • రాను పోనూ కలిపి పెద్దలకు రూ. 2500, పిల్లలకు రూ. 2000

హైదరాబాద్​ నుంచి వచ్చే వారికోసం బస్​ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. బస్​ ప్యాకేజీతో బుక్​ చేసుకున్నవారికి పెద్దలకు రూ.3999, పిల్లలకు రూ. 3399 ఛార్జీ ఉంది. టికెట్ల కోసం ఆన్ లైన్​లో www.tstdc.in ని సంప్రదించవచ్చు అని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: World Record: ఏడు పదుల వయసు.. ఏడు నిమిషాల్లో వరల్డ్ రికార్డ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.