ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్లు తగ్గించాలి.. వైద్యులకు హరీశ్‌రావు ఆదేశం

author img

By

Published : Jan 3, 2023, 3:45 PM IST

Updated : Jan 3, 2023, 7:20 PM IST

minister harishrao
మంత్రి హరీశ్​రావు

Harish Rao inaugurated 30bed government hospital in Nalgonda: ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకే డాక్టర్లు, గర్భిణీలు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి హరీశ్​రావు అన్నారు. నల్గొండ జిల్లాలోని మర్రిగూడలో 30 పడకల ప్రభుత్వం ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పలు రకాలు సూచనలు చేశారు.

నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీశ్​రావు

Harish Rao inaugurated a 30-bed government hospital in Nalgonda: ప్రతి మూడు నెలలకు ఒకసారి మునుగోడ అభివృద్ధిపై సమీక్షిస్తామని.. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్​రావుతో పాటు మంత్రి జగదీశ్​రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్​, ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి పాల్గొన్నారు.

ఆస్పత్రుల్లో సిబ్బందిని పెంచామని ఆసుపత్రుల్లో పనితీరు కూడా మెరుగుపడాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ఇకముందు సిజేరియన్లు కూడా తగ్గించేలా చూడాలని.. ఈ సిజేరియన్​ల వల్ల మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మంంత్రి హరీశ్​రావు అన్నారు. శిశువు జన్మించగానే మొదటి గంటలోనే తల్లి పాలు తాగిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలకు అన్ని చికిత్సలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల చికిత్సలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కోరారు.

రాష్ట్రంలో 950 నూతన డాక్టర్లకు ఉద్యోగాలు ఇచ్చామని.. కేవలం నల్గొండ జిల్లాకే 41 మంది డాక్టర్లని కేటాయించమన్నారు. మర్రిగూడ 30 పడకల ప్రభుత్వం ఆసుపత్రికి 8 మంది డాక్టర్లని నియమించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టలేదని రాష్ట్రానికి ఇచ్చే నిధులలో రూ.12వేల కోట్లు కేంద్రం నిలిపివేసిందని కేంద్ర వైఖరిపై మండిపడ్డారు. రాష్ట్రంలో అమలయ్యే పథకాలు పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కొనియాడారు. ఉప ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెప్పారు. చర్లగూడెం ప్రాజెక్ట్​లో పునరావాసం కోల్పోయిన నిర్వాసితులకు ఇళ్ల స్థలాల కోసం సమీక్ష నిర్వహించి ఇళ్లు స్థలాలు ఇస్తామని మంత్రి హరీశ్​రావు హామీ ఇచ్చారు.

"అన్ని రకాల డాక్టర్లు వచ్చారు. గర్భిణీల కోసం స్కానింగ్​ చేయడానికి ఒక గైనిక్​ డాక్టర్​ను.. ఆల్ట్రాసౌండ్​ మిషన్​ కూడా పెట్టిస్తాము. పిల్లల కోసం పిల్లల డాక్టర్​.. కళ్ల కోసం కళ్ల డాక్టర్​ను కూడా ఈ ఆసుపత్రికి కేటాయించాము. వృద్ధులు కళ్లకు కెటరాక్టు ఆపరేషన్​ చేయిస్తాము. ఈ ఆపరేషన్​ బయట చేయించుకుంటే రూ.25000 అవుతుంది. కంటి ఆపరేషన్​కు కావాల్సిన ఆపరేషన్​ దియేటర్ కూడా సమకూర్చాము." - హరీశ్​రావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి

ఇవీ చదవండి:

Last Updated :Jan 3, 2023, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.